Dharani
Jio Rs 1549 Plan Details: జియో నుంచి బెస్ట్ ప్లాన్ ఒకటి అందుబాటులో ఉంది. దీన్ని రీఛార్జ్ చేసుకుంటే.. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందడమే కాక.. 300 జీబీ డేటా కూడా పొందవచ్చు. ఇంతకు ఆ ప్లాన్ ఏదంటే..
Jio Rs 1549 Plan Details: జియో నుంచి బెస్ట్ ప్లాన్ ఒకటి అందుబాటులో ఉంది. దీన్ని రీఛార్జ్ చేసుకుంటే.. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందడమే కాక.. 300 జీబీ డేటా కూడా పొందవచ్చు. ఇంతకు ఆ ప్లాన్ ఏదంటే..
Dharani
ఈ నెల ప్రారంభంలో టెలికాం కంపెనీలు సామాన్యులకు భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిదే. రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జూలై 4 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. పెరిగిన రీఛార్జ్ ప్లాన్ రేట్లపై సామాన్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక్కో ప్లాన్ మీద ఏకంగా 50-100 రూపాయల వరకు పెంచాయి టెలికాం కంపెనీలు. ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ వంటి కంపెనీలన్ని రీఛార్జ్ ప్లాన్స్ రేట్లను పెంచాయి. ప్రతి కంపెనీ దాదాపు 25 శాతం మేర ప్లాన్ ధరలను పెంచి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. పెరిగిన ప్లాన్ ధరలతో ఇబ్బంది పడుతున్న వేళ జియో ఊరట కలిగించే వార్త చెప్పింది. బెస్ట్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని రీఛార్జ్ చేసుకుంటే.. 300 జీబీ డేటాతో పాటుగా.. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు. ఆ వివరాలు..
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం.. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌లలో అనేక రకాల ప్లాన్స్‌లను తీసుకొచ్చిది. వీటిలో కొన్నింటికి ప్రత్యేకంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. అలాంటి ఒక ప్లాన్ గురించి ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం. ఈ ప్లాన్ ద్వారా మీరు 300 జీబీ డేటాతో పాటుగా.. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందటమే కాక.. అపరిమిత 5జీ డేటాను కూడా పొందుతారు. మరి ఈ ప్లాన్ పొందాలంటే ఎంత ఖర్చు చేయాలంటే.. 1549 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే.. ఈ ప్లాన్‌ను వాడుకోవచ్చు.
ఈ ప్లాన్ ద్వారా 300 జీడీ డేటాతో పాటుగా నెట్‌ఫ్లిక్స్ (మొబైల్), అమెజాన్ ప్రైమ్‌తో పాటుగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఉచితంగా పొందే అకవాశం ఉంది. ఇక ఈ ప్లాన్‌లో ఉన్న మరో అతిముఖ్యమైన సదుపాయం ఏంటంటే.. ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్.. 500 జీబీ డేటా వరకు రోల్ ఓవర్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. అంటే మీరు ఒక నెలలో మొత్తం డేటాను ఖర్చు చేయలేకపోతే.. మిగిలిన డేటాను తదుపరి నెల డేటాకు యాడాన్ అవుతుంది. ఈ ప్లాన్‌లో డేటాతో పాటు.. అపరిమిత వాయిస్ కాల్ సౌకర్యాన్ని పొందుతారు. ప్రతి రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా వస్తాయి.
అయితే ఈ ప్లాన్‌తో జియో సినిమా ప్రీమియం కంటెంట్‌కు యాక్సెస్ అందుబాటులో లేదు. ఇక ప్లాన్‌తో పాటు వచ్చే అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ 2 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో యూఎస్‌ఏలో అంతర్జాతీయ రోమింగ్ సమయంలో 5జీబీ హై స్పీడ్ డేటా, 500 కాలింగ్ నిమిషాలు లభిస్తాయి. అదే సమయంలో యూఏఈలో అంతర్జాతీయ రోమింగ్‌లో 1జీబీ హై స్పీడ్ డేటా, 300 కాలింగ్ నిమిషాలు అందుబాటులో ఉంటాయి అని తెలుస్తోంది.