iDreamPost
android-app
ios-app

Jio న్యూ రీచార్జ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్ .. లేట్ చేయకండి

Jio 365 days Recharge Plan: జియో యూజర్లకు అదిరిపోయే రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. కొత్తగా తీసుకొచ్చిన వార్షిక ప్లాన్ తో సూపర్ బెనిఫిట్స్ పొందొచ్చు. లేట్ చేయకండి.

Jio 365 days Recharge Plan: జియో యూజర్లకు అదిరిపోయే రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. కొత్తగా తీసుకొచ్చిన వార్షిక ప్లాన్ తో సూపర్ బెనిఫిట్స్ పొందొచ్చు. లేట్ చేయకండి.

Jio న్యూ రీచార్జ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్ .. లేట్ చేయకండి

గత నెలలో ప్రముఖ టెలికాం కంపెనీ జియో టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంతో మొబైల్ యూజర్లు అసహనం వ్యక్తం చేశారు. తక్కువ ధరతో రీఛార్జ్ ప్లాన్లను అందించే నెట్ వర్క్ లకు మారేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ కు మారారు. ఈ క్రమంలో తమ కస్టమర్లను కాపాడుకునేందుకు జియో కొత్త రీచార్జ్ ప్లాన్లను తీసుకొస్తున్నది. రీజనబుల్ ధరలో మంచి బెనిఫిట్స్ తో ప్లాన్లను తీసుకొస్తున్నది. ఈ క్రమంలో జియో మరో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. రూ. 3999తో వార్షిక ప్లాన్ ను ప్రవేశ పెట్టింది.

జియో రూ.3999 వార్షిక ప్లాన్:

కస్టమర్లను ఆకర్షించేందుకు జియో రూ.3999 వార్షిక ప్లాన్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ తో ఏడాది పొడవునా నిరాంతరాయంగా సేవలను పొందవచ్చు. వార్షిక ప్లాన్ల కోసం చూసే వారికి ఇది బెస్ట్ ప్లాన్ అంటున్నారు మార్కెట్ వర్గాలు. ఒకసారి రూ. 3999తో రీచార్జ్ చేసుకుంటే 365 రోజులు నిరంతరం అంతరాయం లేని సేవలను పొందవచ్చు. అంటే సంవత్సరం పాటు బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ కాల్స్, ప్రతి రోజు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు పొందవచ్చు. ఈ ప్లాన్తో రోజుకు2.5జీబీ తో అన్ లిమిటెడ్ 5జీ డేటా ను పొందుతారు. అంతేకాకుండా ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. వినియోగదారులు ఉచిత ఫ్యాన్ కోడ్ సబ్‌స్క్రిప్షన్, జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ ఉచిత సబ్‌స్క్రిప్షన్లను పొందుతారు.

రూ. 3599 వార్షిక ప్లాన్:

జియో కస్టమర్లకు మరో వార్షిక ప్లాన్ అందుబాటులో ఉంది. రూ. 3599 తో రీచార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడీటీ పొందొచ్చు. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, డైలీ 2.5జీబీ డేటాను పొందొచ్చు. ఇక వీటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్ సబ్‌స్క్రిప్షన్లను పొందొచ్చు.