iDreamPost
android-app
ios-app

అదిరిపోయే బ్యాటరీ కెపాసిటీతో 12 వేలకే Jio ల్యాప్ టాప్!

  • Published Oct 14, 2024 | 4:08 PM Updated Updated Oct 14, 2024 | 4:08 PM

JioBook: జియో గతంలో జియోబుక్‌ 11 పేరుతో ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. అయితే తాజాగా ఈ ల్యాప్‌టాప్‌పై మంచి డిస్కౌంట్‌ను ఇస్తోంది.

JioBook: జియో గతంలో జియోబుక్‌ 11 పేరుతో ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. అయితే తాజాగా ఈ ల్యాప్‌టాప్‌పై మంచి డిస్కౌంట్‌ను ఇస్తోంది.

అదిరిపోయే బ్యాటరీ కెపాసిటీతో 12 వేలకే Jio ల్యాప్ టాప్!

జియో.. జియో.. జియో.. ఎక్కడ చూసిన అంతా జియో మాయం అవుతుంది. డిజిటల్ విభాగంలో గేమ్ చేంజర్ గా జియో దూసుకుపోతుంది. ప్రారంభంలో సిమ్ లతో ఊచకోత కోసిన జియో.. టెలికాం రంగంలో తన ప్రత్యర్ధ కంపెనీలను వణికించింది. జియో దెబ్బకు టెలికాం కంపెనీలన్నీ దిగొచ్చేశాయి. రేట్లు తగ్గించాయి. అయినా కానీ జియోని ఏమాత్రం డామినేట్ చేయలేకపోయాయి. ఇప్పటికీ టెలికాం రంగంలో నెంబర్ వన్ గా దూసుకుపోతుంది జియో. అంతటితో ఆగకుండా తన జియో బ్రాండ్ ని మరింత విస్తరిస్తున్నాడు అంబానీ. ఎలక్ట్రానిక్స్ విభాగంలో కూడా తగ్గేదెలే అన్నట్లు దూసుకుపోతుంది జియో. మార్కెట్లో ఇతర స్మార్ట్ ఫోన్ల కంపెనీలకు ధీటుగా స్మార్ట్ ఫోన్ లను, ఫీచర్ ఫోన్ లని లాంచ్ చేసింది. అవి కూడా ప్రజలకు అందుబాటు ధరలో మంచి ఫీచర్లతో లాంచ్ అయ్యాయి. అలాగే జియో ల్యాప్ టాప్ విభాగంలోకి కూడా అడుగు పెట్టింది. తన వినియోగదారులకు తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో జియో గతంలో జియోబుక్‌ 11 పేరుతో ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. అయితే తాజాగా యూజర్ల కోసం ఈ ల్యాప్‌టాప్‌పై మంచి డిస్కౌంట్‌ను ఇస్తోంది.

ఇక ఆఫర్‌లో భాగంగా ఈ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ. 12,890కే మనం సొంతం చేసుకోవచ్చు. ఇంకా అలాగే దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ కూడా వస్తుంది. పలు ఫేమస్ ఈ కామర్స్ వెబ్ సైట్స్ తో పాటు రిలయన్స్‌ డిజిటల్‌లో కూడా ఈ ల్యాప్‌టాప్‌ అందుబాటులో ఉంది. సాధారణంగా ల్యాప్ టాప్ కావాలంటే కచ్చితంగా 20 వేల పైన చెల్లించాల్సి వస్తుంది. కానీ తక్కువ ధరలో మంచి ల్యాప్ టాప్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. దీనిలో తక్కువ ధరలోనే మంచి ఫీచర్లనేవీ రావడం విశేషం. ఇక ఈ జియో బుక్ 11 ల్యాప్ లో ఎలాంటి ఫీచర్లు వస్తాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాప్‌టాప్‌ ని సింపుల్ గా 4జీ లేదా 5జీ మొబైల్‌ నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేసుకోని వాడుకోవచ్చు. లేదా వైఫైకి కూడా కనెక్ట్ చేసుకోని వాడవచ్చు. జియో ఓస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ల్యాప్‌టాప్‌ వర్క్ అవుతుంది. ఈ ల్యాప్ టాప్ కి 11.6 ఇంచెస్‌ స్క్రీన్‌ను ఇచ్చారు. పెద్ద సైజ్ స్క్రీన్ అంటే చాలా మందికి నచ్చదు. ల్యాప్ టాప్ సింపుల్ గా పోర్టబుల్ సైజ్ లో ఉండేవారికి ఇది చాలా బాగుంటుంది. ప్రయాణాల్లో దీన్ని వాడటం చాలా ఈజీగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌ బరువు చాలా తక్కువ. ఇది కనీసం కేజీ బరువు కూడా ఉండదు. ఇది కేవలం 990 గ్రాములు మాత్రమే ఉంటుంది. సొ ఎక్కువగా ఫీల్డ్ వర్క్ జాబ్స్ చేసేవారికి ఈ ల్యాప్ టాప్ బాగా యూజ్ అవుతుంది.

ఇక ఈ జియో బుక్‌ 11 ల్యాప్ టాప్ కేవలం బ్లూ కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ల్యాప్ టాప్ లో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ఉంటుంది. ఇందులో అన్నిటికన్నా ఆకట్టుకునే ఫీచర్ ఏంటంటే దీని బ్యాటరీ కెపాసిటీ. మామూలుగా మనం వాడే ల్యాప్ టాప్ లో ఛార్జింగ్ ఎంత వస్తుంది. కంటిన్యూస్ గా వాడితే మహా అంటే ఒక 5 గంటలు వస్తుంది. కానీ ఈ జియో బుక్ 11 ల్యాప్ టాప్ ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 8 గంటలకు పైగా రన్ అవుతుంది. ఈ ల్యాప్ టాప్ పై మీకు వన్ ఇయర్ బ్రాండ్ వారంటీ కూడా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లేదా ఇతర ఆన్లైన్ జాబ్స్ చేసేవారికి తక్కువ ధరలో ఇది బెస్ట్ ల్యాప్ టాప్ అని చెప్పవచ్చు. మీరు కూడా తక్కువ బడ్జెట్ లో ల్యాప్ టాప్ కొనాలని ఆలోచిస్తున్నట్లైతే దీన్ని ట్రై చెయ్యండి. ఇక 12 వేల బడ్జెట్ రేంజిలో వస్తున్న ఈ జియో బుక్ 11 ల్యాప్ టాప్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ లాప్ టాప్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి.