iDreamPost
android-app
ios-app

Infosysపై కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఐటీ ఉద్యోగుల ఫిర్యాదు.. కారణం ఏంటంటే?

దిగ్గజ ఐటీ కంపెనీపై ఫిర్యాదు చేశారు ఉద్యోగులు. ఇన్ఫోసిస్ పై కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఐటీ ఉద్యోగులు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదుకు గల కారణం ఏంటంటే?

దిగ్గజ ఐటీ కంపెనీపై ఫిర్యాదు చేశారు ఉద్యోగులు. ఇన్ఫోసిస్ పై కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఐటీ ఉద్యోగులు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదుకు గల కారణం ఏంటంటే?

Infosysపై కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఐటీ ఉద్యోగుల ఫిర్యాదు.. కారణం ఏంటంటే?

వరల్డ్ వైడ్ గా ఐటీ రంగంలోని ఉద్యోగులు విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ లేఆఫ్స్ కు తెరలేపడంతో వందలాది మంది ఉద్యోగాలు పోతున్నాయి. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఐటీ ఎంప్లాయీస్. ఇప్పటి వరకు 80 వేలకు పైగా ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పై ఐటీ ఉద్యోగులు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కంప్లైంట్ ఉద్యోగులను తొలగించినందుకు మాత్రం కాదు. క్యాంపస్ రిక్రూట్ మెంట్లకు ఆన్ బోర్డింగ్ ప్రక్రియను ఆలస్యం చేయడంతో ఫిర్యాదు చేశారు.

ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ లో 2,000 మంది క్యాంపస్ రిక్రూట్మెంట్లకు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తోందని ఐటీ ఉద్యోగుల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ కంప్లైంట్ చేసింది. ఇన్ఫోసిస్ ఇలా చేయడం వల్ల ఉద్యోగులు ఆర్థిక, మానసికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని యూనియన్ ఆరోపణలు చేసింది. ఇన్ఫోసిస్‌లో రెండేళ్లుగా ఆన్‌బోర్డింగ్‌ జాప్యం కొనసాగుతోందని తెలిపింది.

ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లపై ఆధారపడి చాలా మంది ఇతర ఉద్యోగ ఆఫర్లను తిరస్కరించారని తీరా చూస్తే ఆదాయంతోపాటు స్పష్టమైన ఆన్‌బోర్డింగ్ టైమ్‌లైన్ లేకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఎన్ఐటీఈఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ఫోసిస్ వ్యవహారం నమ్మక ద్రోహాన్ని సూచిస్తుందని యూనియన్ ఆరోపించింది. ఆన్ బోర్డింగ్ కు మద్దతు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ఇన్ఫోసిస్ కు ఉందని, దీనిపై జోక్యం చేసుకోవాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఎన్ఐటీఈఎస్ కోరుతోంది. జాప్యం జరిగిన కాలానికి పూర్తి వేతనాలు చెల్లించాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది.