iDreamPost
android-app
ios-app

కేంద్రం స్కీమ్‌.. నెలకు 420 చెల్లిస్తే.. భార్యాభర్తలిద్దరు ప్రతి నెలా 10 వేలు పొందే ఛాన్స్

Atal pension yojana scheme: మీరు ప్రభుత్వ పధకాల్లో పెట్టుబడి పెట్టి మంచి లాభాలను పొందాలనుకుంటున్నారా? అయితే కేంద్రం అందించే ఈ స్కీమ్ లో నెలకు రూ. 420 చెల్లిస్తే ప్రతి నెల భార్యాభర్తలిద్దరు 10 వేలు పొందొచ్చు.

Atal pension yojana scheme: మీరు ప్రభుత్వ పధకాల్లో పెట్టుబడి పెట్టి మంచి లాభాలను పొందాలనుకుంటున్నారా? అయితే కేంద్రం అందించే ఈ స్కీమ్ లో నెలకు రూ. 420 చెల్లిస్తే ప్రతి నెల భార్యాభర్తలిద్దరు 10 వేలు పొందొచ్చు.

కేంద్రం స్కీమ్‌.. నెలకు 420 చెల్లిస్తే.. భార్యాభర్తలిద్దరు ప్రతి నెలా 10 వేలు పొందే ఛాన్స్

డబ్బు సంపాదిస్తే సరిపోదు.. దాన్ని సక్రమంగా నిర్వహిచే మెలుకువలు తెలిసి ఉండాలి. అనవసరపు ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టాలి. కోటలు మేడలు కట్టాలన్నా.. కాటికి నలుగురు మోయాలన్నా డబ్బు ఉండాల్సిందే. ప్రతి పని డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. బంధాలు బాంధవ్యాలకంటే డబ్బుకే ఇంపార్టెన్స్ ఇచ్చే రోజులు ఇవి. అందుకే ప్రతి ఒక్కరు పొదుపు మార్గాలవైపు ఆలోచిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందాలని చూస్తున్నారు. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. అదే అటల్ పెన్షన్ యోజన పథకం.

అసంఘటిత కార్మికులకు కూడా పెన్షన్ అందించాలనే సదుద్దేశంతో కేంద్రం ఈ అటల్ పెన్షన్ స్కీమ్ ని తీసుకొచ్చింది. ఈ పథకంలో నెలకు రూ. 420 చెల్లిస్తే భార్యాభర్తలిద్దరు నెలకు రూ. 10 వేలు పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకైతే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. మరి అసంఘటిత రంగ కార్మికులకు ఇలాంటి సౌకర్యం ఉండదు కదా. అందుకే వీరికి కూడా 60 సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్ అందాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరి పెట్టుబడి పెడితే.. 60ఏళ్ల తర్వాత పెట్టిన పెట్టుబడిపై ఆదారపడి ప్రతి నెల పెన్షన్ రూపంలో ఆదాయం సమకూరుతుంది. అయితే ఈ స్కీమ్ లో చేరే వ్యక్తుల వయసును బట్టి చెల్లించే మొత్తం మారుతుంటుంది.

పెట్టిన పెట్టుబడిపై 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 1000, రూ. 2000, రూ. 3 వేలు, 4 వేలు, గరిష్టంగా రూ. 5 వేల వరకు పెన్షన్ పొందొచ్చు. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి ఈ స్కీమ్ లో చేరితే నెలకు రూ. 42 నుంచి గరిష్టంగా రూ. 210 వరకు చెల్లించాలి. ఒక వేళ నెలకు రూ. 210 చెల్లించాలనుకుంటే.. రోజుకు రూ. 7 ఆదా చేస్తే చాలు. 60ఏళ్లు నిండిన తర్వాత రూ. 5 వేల పెన్షన్ అందుకోవచ్చు. భార్యాభర్తలిద్దరు చేరితే అప్పుడు రోజుకు రూ. 14 ఆదా చేసి నెలకు రూ. 420 చెల్లిస్తే చాలు. అప్పుడు దంపతులిద్దరికీ కలిపి నెలకు రూ. 10 వేల వరకు పెన్షన్ వస్తుంది.

ఇక ఈ అటల్ పెన్షన్ స్కీంలో అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఆన్ లైన్ లో చేసుకోవచ్చు. లేదా బ్యాంకుల్లో ఖాతా ఓపెన్ చేయొచ్చు. 18-40 సంవత్సరాల వయసున్న వ్యక్తులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. 40 ఏళ్లు దాటిన వారికి ఛాన్స్ లేదు. అటల్ పెన్షన్ యోజన స్కీంలో ఇన్వెస్ట్ చేయదలిచిన వారికి పోస్టాఫీస్ లేదా ప్రభుత్వ రంగ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. నేషనల్ పెన్షన్ స్కీం పరిధిలోకి వచ్చేవారు అనర్హులు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు కూడా ఈ పథకానికి అర్హులు కారు.