iDreamPost
android-app
ios-app

Interest Free Loans: గుడ్ న్యూస్.. వారికి వడ్డీ లేకుండా రుణం.. అర్హతలు, పూర్తి వివరాలు..

  • Published Dec 22, 2023 | 11:56 AM Updated Updated Dec 22, 2023 | 12:05 PM

నేటి కాలంలో ఎంత చిన్న మొత్తం అప్పు తీసుకున్నా వడ్డీ కచ్చితంగా చెల్లించాల్సిందే. ఆఖరికి పొదుపు సంఘాలకు ఇచ్చే లోన్లకు కూడా ఎంతో కొంత ఇంట్రెస్ట్ వసూలు చేస్తారు. అయితే మన దేశంలో కొందరు వడ్డీ లేని లోన్ పొందే అవకాశం కలిగి ఉన్నారు. వారు ఎవరంటే..

నేటి కాలంలో ఎంత చిన్న మొత్తం అప్పు తీసుకున్నా వడ్డీ కచ్చితంగా చెల్లించాల్సిందే. ఆఖరికి పొదుపు సంఘాలకు ఇచ్చే లోన్లకు కూడా ఎంతో కొంత ఇంట్రెస్ట్ వసూలు చేస్తారు. అయితే మన దేశంలో కొందరు వడ్డీ లేని లోన్ పొందే అవకాశం కలిగి ఉన్నారు. వారు ఎవరంటే..

  • Published Dec 22, 2023 | 11:56 AMUpdated Dec 22, 2023 | 12:05 PM
Interest Free Loans: గుడ్ న్యూస్.. వారికి వడ్డీ లేకుండా రుణం.. అర్హతలు, పూర్తి వివరాలు..

నేటి కాలంలో అప్పు దొరకడమే కష్టం. అది కూడా పెద్ద మొత్తంలో ఇంట్రెస్ రేటుకి లభిస్తుంది. కొందరు పది రూపాయలు ఆ పైన వడ్డీ కూడా వసూలు చేస్తుంటారు. ఆఖరికి బ్యాంక్ లు సైతం ఎంతో కొంత వడ్డీని వసూలు చేస్తాయి. అసలు ఇంట్రెస్ట్ లేకుండా లోన్ దొరకడం అంటే అది ఎనిమిదో ప్రపంచ వింతే అవుతుంది. ఇక ప్రైవేట్ కంపెనీలు, లోన్ యాప్ లు అయితే వడ్డీ మీద వడ్డీ వసూలు చేసి.. ఇచ్చిన అమౌంట్ కి డబుల్ వసూలు చేస్తాయి. డబ్బులు తిరిగి చెల్లించకపోతే ప్రైవేట్ లోన్ యాప్ లు ఎంతకు దిగజారతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ప్రస్తుత కాలంలో వడ్డీ లేకుండా రుణం లభించడం అసాధ్యం. ఆఖరికి పొదుపు సంఘాలకు ఇచ్చే లోన్ లకు కూడా పావలా వడ్డీ వసూలు చేస్తాయి. అయితే తాజాగా ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. దేశంలో కొందరికి వడ్డీ లేకుండా రుణం పొందే సదుపాయం ఉంది. మరి ఎవరికి ఇలా ఇంట్రెస్ లేకుండా లోన్ లు ఇస్తారు.. అర్హతలు ఏంటి వంటి వివరాలు..

వడ్డీ లేని రుణాలు పొందాలంటే ప్రభుత్వ ఉద్యోగులు అయ్యి ఉండాలి. అది కూడా 2004కు ముందు ఉద్యోగంలో చేరిన వారికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. వారి ఉద్యోగ సమయంలో ప్రభుత్వాలు అనేక రకాల సదుపాయాలు కల్పిస్తుంటాయి. వాటితో పాటు ప్రత్యేక రుణ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగ సమయంలో ఈ రుణ సదుపాయన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దీనిలో మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఆ ఉద్యోగికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. పైగా ఈ లోన్ పై ఎటువంటి వడ్డీ వసూలు చేయరు.

వాస్తవానికి, 2004 సంవత్సరానికి ముందు ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారు ఇలా వడ్డీ లేని రుణం పొందగలరు. ఎందుకంటే వారి కోసం జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్‌) అమలులో ఉండేది. ఇది ఎందుకు అంటే.. ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తం కట్‌ చేసి, ఈ ఖాతాలో జమ చేస్తారు. ఇది పదవీ విరమణ లేదా ఉద్యోగ సమయంలో అనుకోని అవసరాలకు అందుబాటులో ఉంటుంది.

ఈ ఖాతాలో అతి ముఖ్యమైన లాభం, దీని ప్రత్యేకత ఏంటంటే.. ఈ మొత్తాన్ని మీరు రుణం రూపంలో తీసుకోవచ్చు. ఇలా జీపీఎఫ్ ఖాతా నుంచి లోన్ తీసుకుంటే.. ఆ మొంత్తం మీద ఎలాంటి వడ్డీ వసూలు చేయరు. అయితే 2004 నుంచి కొత్త పెన్షన్ స్కీమ్ నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌(ఎన్‌పీఎస్) అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలు ప్రారంభించడాన్ని నిలిపివేశారు.

జీపీఎఫ్‌ ఖాతాలో డిపాజిట్ నియమం..

ప్రతి నెలా, ప్రభుత్వ ఉద్యోగి బేసిక్, డీఏ జీతంలో 6 శాతం జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఇది కనిష్ట మొత్తం, గరిష్టంగా 100 శాతం కూడా డిపాజిట్ చేయవచ్చు. దీనిపై ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం వడ్డీ కూడా లభిస్తుంది. ప్రస్తుతం జీపీఎఫ్‌పై వార్షిక వడ్డీ 7.1 శాతంగా ఉంది, ఇది ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఇంట్రెస్ట్ రేటు మారుతూ ఉంటుంది.

లోన్ లిమిట్ ఎంత అంటే..

జీపీఎఫ్‌ ఖాతాలో జమ చేసిన మొత్తం నుంచి సుమారు 75 శాతం వరకు అమౌంట్ ని లోన్ గా తీసుకోవచ్చు. అయితే 2021 సంవత్సరంలో, ప్రభుత్వం దీనిపై పరిమితి విధించింది. జీపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం నుంచి 10-50 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించింది. అయితే, తర్వాత దాని పరిమితిని తిరిగి 90 శాతానికి మార్చారు. ఉద్యోగి మొత్తం సర్వీస్ వ్యవధి ఆధారంగా డబ్బు ఉపసంహరణ పరిమితి నిర్ణయిస్తారు.

రెండు రకాల రుణాలు..

జీపీఎఫ్‌ నుంచి రెండు రకాల లోన్లు తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో చేరి 15 సంవత్సరాలు పూర్తయితే.. ఉద్యోగి శాశ్వత రుణాన్ని తీసుకోవచ్చు. దీనిలో గరిష్టంగా 75 శాతం, కొన్ని సందర్భాల్లో 90 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనిపై ఎలాంటి వడ్డీ విధించరు. అంతేకాక రిటైర్మెంట్ కు 10 సంవత్సరాల కంటే తక్కువ సమయం ఉంటే, ఈ డబ్బును తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైతే ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లించొచ్చు. ప్రభుత్వం మాత్రం ఈ లోన్ లను రికవరీ చేయదు.

అలానే 15 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులకు తాత్కాలిక రుణం ఇస్తారు. ఇందులో కూడా డిపాజిట్ చేసిన మొత్తంలో 75 శాతం, కొన్ని సందర్భాల్లో 90 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనిపై వడ్డీ కూడా వసూలు చేయరు. అయితే ఇలా తీసుకున్న మొత్తాన్ని 24 సమాన వాయిదాలలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి జీపీఎఫ్ లోన్ తీసుకునే సౌకర్యం లేదు.