iDreamPost
android-app
ios-app

ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేస్తున్నారా?.. ఇది తప్పక తెలుసుకోవాల్సిందే!

  • Published Nov 15, 2024 | 10:44 AM Updated Updated Nov 15, 2024 | 10:44 AM

Income Tax Act: డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాక ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోతున్నాయి. పది, ఇరవై రూపాయలకు కూడా యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారు. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తే చిక్కుల్లో పడతారు.

Income Tax Act: డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాక ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోతున్నాయి. పది, ఇరవై రూపాయలకు కూడా యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారు. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తే చిక్కుల్లో పడతారు.

ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేస్తున్నారా?.. ఇది తప్పక తెలుసుకోవాల్సిందే!

ప్రస్తుత రోజుల్లో బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోతున్నది. డిజిటల్ పేమెంట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక ఆన్ లైన్ లోనే చెల్లింపులు చేసేస్తున్నారు. నగదు డిపాజిట్ చేయాలన్నా, విత్ డ్రా చేయాలన్నా అంతా ఆన్ లైన్ ద్వారానే జరిగిపోతున్నది. కిరాణా షాప్ దగ్గర్నుంచి షాపింగ్ మాల్ వరకు ట్రాన్సాక్షన్స్ అన్ని డిజిటల్ రూపంలోనే చెల్లిస్తున్నారు. 10 రూపాయలు చెల్లించాలన్నా యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారు. యూపీఐ పేమెంట్స్ వచ్చాక ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయాయి. ఇష్టం వచ్చినట్టుగా లావాదేవీలు నిర్వహిస్తే చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ మీఖాతాలను పర్యవేక్షిస్తుంది. ఆదాయపన్ను చట్టం ప్రకారం మీ సంపాదనుకు అనుగుణంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పన్ను చెల్లింపుదారులను ఆదాయ పన్నుశాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆదాయపన్ను చెల్లింపులో అవకతవకలకు పాల్పడే వారిపై ఆదాయపన్ను శాఖ చర్యలు తీసుకుంటుంది. ఇన్ కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లో రూ.10 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. 10 లక్షలకు మించి డబ్బుల్ని జమ చేస్తే మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారు. ఆ నగదుపై మీరు పన్ను చెల్లించాల్సి రావొచ్చు. పరిమితికి మించి ఎక్కువ నగదు జమ చేసినట్లయితే ఆ ఖాతా వివరాలను బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తాయి. పరిమితికి మించి డిపాజిట్ చేస్తే అది ఆదాయపన్ను శాఖ పరిధిలోకి వెళ్తుంది.

ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 లోని సెక్షన్ 285బీఏ ఈ నిబంధనలు సూచిస్తోంది. సేవింగ్స్ ఖాతాలోని డబ్బును ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు అందులో ఇచ్చిన సమాచారంతో సరిపోలకపోతే ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది. వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో జమలు, ఉపసంహరణలను కూడా పన్ను శాఖ పర్యవేక్షిస్తుంది. కాబట్టి ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేసేటప్పుడు, అది సమస్యలను తెచ్చిపెడుతుంది. అంతే కాదు 50వేల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు పాన్ కార్డ్ వివరాలను అందించాల్సి ఉంటుంది.

అప్పుడు మీ చెల్లింపులన్నీ ఆదాయ పన్ను శాఖ అధికారుల దృష్టికి వస్తాయి. పాన్ వివరాలు అందించని లావాదేవీలపై ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నోటీసులు జారీ చేస్తుంది. ఐటీ శాఖకు తప్పుడు సమాచారం ఇస్తే కొన్నిసార్లు జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుంది. అలాగే ఖాతాలో రూ.50 లక్షల కంటే ఎక్కువ జమ చేసినట్లైతే ఆ వివరాలను పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరంలో ఏదైనా బ్యాంక్ ఖాతా నుండి రూ.1 కోటి కంటే ఎక్కువ నగదు ఉపసంహరణలపై టీడీఎస్‌ చెల్లించాల్సి ఉంటుంది.