iDreamPost
android-app
ios-app

IT శాఖ హెచ్చరిక.. ఆ తప్పు చేస్తే.. రూ. 10 లక్షల ఫైన్‌

  • Published Jul 12, 2024 | 2:58 PMUpdated Jul 12, 2024 | 2:58 PM

IT Returns-Rs 10 Lakh Fine, Foreign Assets, Income: పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆ తప్పు చేస్తే.. 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. ఆ వివరాలు..

IT Returns-Rs 10 Lakh Fine, Foreign Assets, Income: పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆ తప్పు చేస్తే.. 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. ఆ వివరాలు..

  • Published Jul 12, 2024 | 2:58 PMUpdated Jul 12, 2024 | 2:58 PM
IT శాఖ హెచ్చరిక.. ఆ తప్పు చేస్తే.. రూ. 10 లక్షల ఫైన్‌

మీరు ఆదాయపన్ను చెల్లిస్తారా.. అయితే మీకోసమే ఈ వార్త. పన్ను చెల్లింపుదారులు.. ఆ విషయంలో తప్పుచేస్తే.. భారీ ఎత్తున జరిమానా చెల్లించాల్సి వస్తుందని.. ఆదాయపన్ను శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ట్యాక్స్‌దారులు కొన్ని విషయాలను దాస్తే.. ఏకంగా 10 లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుందని ఐటీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంతకు దేనికి సంబంధించి ఈ అలర్ట్‌ జారీ చేశారు.. ఎందుకు ఇంత భారీ మొత్తంలో ఫైన్‌ విధించనున్నారు అనే దాని గురించి పూర్తి స్థాయిలో తెలియాలంటే.. ఈ వార్త చదవండి

ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్నులు ఫైల్‌ చేసేందుకు సమయం దగ్గర పడుతుంది. కొద్ది రోజులు మాత్రమే గడువుంది. చాలా మంది ఆఖరి నిమిషంలో రిటర్నులు ఫైల్‌ చేస్తుంటారు. ఈ హడావుడిలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఆ తర్వాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అందుకే ఆఖరి నిమిషంలో హడావుడి పడకుండా.. ముందే అన్ని వివరాలను సేకరించి పెట్టుకుని.. ఆ తర్వాత రిటర్న్‌లు దాఖలు చేయాలని ఐటీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఐటీ రిటర్నులకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆదాయశాఖ.. సోషల్‌ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేసింది. విదేశాల్లోని ఆస్తులు, ఆదాయానికి సంబంధించిన వివారాలను ఐటీ రిటర్నుల్లో వెల్లడించాలని స్పష్టం చేసింది. లేదంటే 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఐటీ శాఖ ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేసింది.

‘‘పన్ను చెల్లింపుదారులకు అలర్ట్‌. విదేశాల్లో బ్యాంక్‌ అకౌంట్లు, ఆదాయం, ఆస్తులు ఉన్న వారు అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2024-25 కోసం ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఫైల్‌ చేసే సమయంలో ఫారెన్‌ అసెట్స్‌ షెడ్యూల్‌ ఫిల్‌ చేయాలి. మీకు విదేశాల్లో బ్యాంకు ఖాతాలు, ఆస్తులు, ఆదాయం ఉన్నట్లయితే.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలి. విదేశీ ఆస్తులు, ఆదాయాలకు సంబంధించిన సమాచారం దాచిపెడితే.. మీకు ఐటీ నోటీసులు వస్తాయి. దీని గురించి వెల్లడించకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయి. బ్లాక్‌ మనీ ట్యాక్స్‌ యాక్ట్‌ 2015 ప్రకారం ఏకంగా 10 లక్షల రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు’’ అని హెచ్చరికలు జారీ చేశారు.

‘‘2023-24 ఆర్థిక సంవత్సరం కోసం ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు జూలై 31, 2024 చివరి తేదీ. ఈలోపు అన్ని వివరాలు సేకరించుకుని.. జాగ్రత్తగా రిటర్న్స్‌ ఫైల్‌ చేయండి’’ అని ఐటీ శాఖ పోస్ట్‌ చేసింది. ఒకవేళ విదేశాల్లో ఉద్యోగం చేసేవారైతే.. అక్కడ పొందే జీతాన్ని ఐటీఆర్‌లో ఇన్‌కం ఫ్రమ్‌ శాలరీ హెడ్‌లో పేర్కొనాలి అని వెల్లడించింది. ఆ విలువను మన కరెన్సీలోనే చూపాల్సి ఉంటుంది. అలానే పని చేసే కంపెనీ వివరాలు కూడా పొందుపర్చాలి. ఒకవేళ మీకు ఇప్పటికే అడ్వాన్స్‌ ట్యాక్స్‌ కట్‌ అయితే.. మీరు క్లెయిమ్‌ చేసుకోవచ్చు అని ఐటీ శాఖ తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి