iDreamPost
android-app
ios-app

సిరులు కురిపిస్తున్న కౌజు పిట్టల పెంపకం.. లక్షల్లో ఆదాయం!

సిరులు కురిపిస్తున్న కౌజు పిట్టల పెంపకం.. లక్షల్లో ఆదాయం!

ఈ రోజుల్లో ఉద్యోగం కంటే ఎక్కువగా సొంతంగా వ్యాపారం చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే పాడి, పౌల్ట్రీ పరిశ్రమల వైపు ఆలోచిస్తున్నారు. మన దేశంలో పాలకు, మాంసానికి కొతర ఎక్కువ. మార్కెట్ లో డిమాండ్ కు సరిపడా ఉత్పత్తి కావడం లేదు. దీంతో పాడి పశువులు, కోళ్ల పెంపకం చేపడుతూ లక్షలు సంపాదిస్తున్నారు. అయితే వీటితో పాటు కొంతమంది కౌజు పిట్టలను పెంచుతూ విపరీతమైన లాభాలను ఆర్జిస్తున్నారు. తక్కువ శ్రమతో, తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను పొందుతున్నారు. కౌజు పిట్టల పెంపకం రైతులు, నిరుద్యోగులందరికి ఉపాధినిచ్చే పరిశ్రమగా మారింది.

కౌజు పిట్టల పెంపకాన్ని లాభదాయకంగా మార్చుకుంటున్నారు రైతులు, నిరుద్యోగులు. కౌజు పిట్టల పెంపకంలో కాస్త శ్రమ పడితే చాలు నెలకు లక్షల ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, కౌజు పిట్ట మాంసం మంచి పౌష్టికాహారం కావడంతో మార్కెట్ లో కౌజు పిట్టలకు ఫుల్ డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో , అతి తక్కువ సమయంలోనే ఎదిగే ఈ క్వయిల్‌ పక్షుల పెంపకం చేపడితే మంచి లాభాలు అందుకోవచ్చు. ఒక కోడిని పెంచే స్థలంలో సుమారు పది కౌజు పిట్టలను పెంచవచ్చు. మాంసానికి పెంచే కౌజులు ఐదు వారాల వయస్సు నుంచి మార్కెట్ లో అమ్ముకోవచ్చు.

క్వయిల్ పక్షుల పెంపకంపై అవగాహన పెంచుకుని, వీటి పోషనలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే లక్షల్లో ఆదాయం పొందే వీలుంది. పౌల్ట్రీకి అనుబంధంగా కౌజు పిట్టల పెంపకం ఉండటం, మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో కౌజుపిట్టల పెంపకాన్ని చేపట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తక్కువ స్థలం, తక్కువ ఖర్చు, తక్కువ సమయంలోనే మార్కెట్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో సొతంగా వ్యాపారం చేయాలనుకునే వారు, రైతులు, నిరుద్యోగులు మొగ్గుచూపుతున్నారు. కాగా కౌజు పిట్టల పెంపకం చేపట్టాలనుకునే వారు కోళ్ళశాస్త్రవిభాగం, పశువైద్యకళాశాల, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌ వారిని సంప్రదించి కౌజు పిట్టల పెంపకం గురించిన పూర్తి వివరాలను పొందవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి