P Venkatesh
Recurring deposit: మీరు మంచి లాభాలను అందించే ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ సూపర్ స్కీంను అందిస్తున్నది. ఇందులో రోజుకు 233 పెట్టుబడి పెడితే 5 లక్షలు పొందొచ్చు.
Recurring deposit: మీరు మంచి లాభాలను అందించే ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ సూపర్ స్కీంను అందిస్తున్నది. ఇందులో రోజుకు 233 పెట్టుబడి పెడితే 5 లక్షలు పొందొచ్చు.
P Venkatesh
దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా.. భవిష్యత్తులో ఆర్థిక కష్టాలను తప్పించుకోవాలంటే ముందుగానే పొదుపు చేయడం అలవర్చుకోవాలి. నేడు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవ్ చేసుకుంటే రేపటికి ఎంతో ఉపయోగపడుతుంది. నేటి రోజుల్లో పొదుపు చేసిన తర్వాతే ఖర్చు చేయాలనే ఆలోచనకు వస్తున్నారు. వివిధ రూపాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి మీరు కూడా పొదుపు చేయాలనుకుంటున్నారా? పోస్టాఫీస్ లో అదిరిపోయే పథకం అందుబాటులో ఉంది. అదే రికరింగ్ డిపాజిట్ స్కీం. ఇందులో రోజుకు 233 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఏకంగా రూ. 5 లక్షలు పొందొచ్చు.
పోస్టాఫీస్ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. వాటిల్లో రికరింగ్ డిపాజిట్ స్కీం ఒకటి. ఇందులో పెట్టుబడి పెడితే గ్యారంటీ రిటర్స్న్ అందుకోవచ్చు. ఈ పథకంలో 6.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. కేంద్రం 3 నెలలకొకసారి వడ్డీరేట్లను సవరిస్తుంది. ఇందులో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు మాత్రమే. మెచ్యూరిటీ తర్వాత కావాలనుకుంటే ఈ పథకాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఇందుకోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టే వీలుంది. సింగిల్ అకౌంట్ కింద ఒకరు, జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా ముగ్గురు ఈ స్కీంలో చేరొచ్చు. మైనర్ పేరిట గార్డియెన్ ఖాతా తెరవొచ్చు.
రికరింగ్ డిపాజిట్ స్కీంలో రోజుకు 233 పెట్టుబడి పెడితే 5 లక్షలు పొందొచ్చు. అంటే మీరు నెలకు రూ. 7 వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇలా 5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడి మొత్తం రూ. 4,20,000 అవుతుంది. ప్రస్తుతమున్న వడ్డీ రేటు ప్రకారం మీ పెట్టుబడిపై రూ. 79,564 వడ్డీ జమ అవుతుంది. మెచ్యూరిటీ నాటికి మీరు పెట్టిన పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీ కలుపుకుని మీ చేతికి మొత్తం రూ. 4,99,564 అందుతుంది. ప్రభుత్వ పథకం కాబట్టి మీ పెట్టుబడికి భద్రత ఉంటుంది.