P Venkatesh
Post office Recurring deposit Scheme: మీరు పెట్టుబడి పెట్టానుకుంటే పోస్టాఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. రోజుకు 100 ఇన్వెస్ట్ చేస్తే చాలు లక్షల్లో ఆదాయం పొందొచ్చు.
Post office Recurring deposit Scheme: మీరు పెట్టుబడి పెట్టానుకుంటే పోస్టాఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. రోజుకు 100 ఇన్వెస్ట్ చేస్తే చాలు లక్షల్లో ఆదాయం పొందొచ్చు.
P Venkatesh
ఎంత సంపాదిస్తున్నామనే దానికన్నా ఎంత పొదుపు చేస్తున్నామనేదే ముఖ్యం. సంపాదనలో కొంత పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తులో ఆర్థిక కష్టాల నుంచి బయటపడొచ్చు. పొదుపు చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాల సంగతి దేవుడెరుగు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం ఉండదు. అదే గవర్నమెంట్ స్కీమ్స్ అయితే పెట్టుబడి సురక్షితంగా ఉండడంతో పాటు గ్యారంటీ రిటర్స్న్ పొందొచ్చు. మరి మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పోస్టాఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. అదే రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఇందులో రోజుకు 100 ఇన్వెస్ట్ చేస్తే చాలు లక్షల్లో ఆదాయం పొందొచ్చు.
పోస్టాఫీస్ అందించే పథకాల్లో రికరింగ్ డిపాజిట్ పథకం ఒకటి. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక లాభాలను అందుకోవచ్చు. ఇందులో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీసు ఆర్డీ పథకానికి 6.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. మెచ్యూరిటీ తర్వాత పొడిగించుకోవాలనుకుంటే ఈ పథకాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఇందుకోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడి మొదలైన సంవత్సరం తర్వాత లోన్ కూడా పొందొచ్చు. ఈ స్కీమ్ లో కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో రోజుకు రూ. 100 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి 5 లక్షలకు పైగా అందుకోవచ్చు. ఐదు సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టారనుకుంటే.. రోజుకు 100 పెట్టుబడి అంటే నెలకు రూ. 3000 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ. 36,000 జమ అవుతుంది. ఐదు సంవత్సరాల్లో మీ పెట్టుబడి రూ. 1,80,000 అవుతుంది. మీరు పెట్టిన ఈ మొత్తం పెట్టుబడిపై ఐదు సంవత్సరాల తర్వాత 6.7 శాతం వడ్డీతో రూ. 34,097 పొందుతారు. మెచ్యూరిటీ నాటికి 2,14,097 అందుతుంది. మీరు మరో ఐదేళ్ల పాటు పొడిగించాలనుకుంటే అంటే 10 ఏళ్ళకు మీ పెట్టుబడి మొత్తం 3,60,000 అవుతుంది. దీనిపై వడ్డీ 1,52,565 వస్తుంది. మెచ్యూరిటీ సమయానికి మీరు పెట్టిన పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీ ఆదాయంతో కలుపుకుని మొత్తం రూ. 5,12,565 రాబడిని అందుకుంటారు.