Dharani
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. త్వరలోనే వారి వేతనం 26 వేల రూపాయల మేర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. త్వరలోనే వారి వేతనం 26 వేల రూపాయల మేర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
Dharani
కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. త్వరలోనే వారి వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రతిపాదనకు సంబంధించి.. నేషనల్ కౌన్సిల్ కార్యదరశి శివ గోపాల్ మిశ్రా.. కేంద్ర కేబినెట్ సెక్రటరీ మిశ్రాకు లేఖ రాశారు. ఉద్యోగుల వేతనాలు, అలవెన్స్‌ల సవరణలపై ప్రభుత్వం దృష్టి సారించాలని లేఖలో పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం గనక ఈ లేఖపై స్పందిస్తూ.. నిర్ణయం తీసుకుంటే.. ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కేంద్రం గనక 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి.. సిఫార్సులను ఆమోదిస్తే.. దాదాపు 49 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు.. 68 లక్షల మంది పెన్షనర్లకు మేలు చేకూరనుంది అంటున్నారు.
సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని సవరిస్తారు. చివరగా 2016లో 7వ వేతన సంఘం సిఫార్సులను ఆమోదించారు. తదుపరి వేతన సంఘం సిఫార్సులు 2026 అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో కేంద్రం గనక ఇప్పుడు 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తే.. దాని సిఫార్సులను సమర్పించి, ఆమోదించడానికి ఒక ఏడాది నుంచి 18 నెలల సమయం పడుతుంది అంటున్నారు. అనగా 2026లో 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ఇక ఉద్యోగులు జీతాల పెంపు విషయం.. వేతన సంఘం సిఫార్సు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ఆధారపడి ఉంటుంది. 8 వ వేతన సంఘం సిఫార్సుల్లో ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68 రెట్లు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస బేసిక్ సాలరీ రూ. 18 వేలుగా ఉన్నందున, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 3.68 రెట్లు పెడితే వారి బేసిక్ పేలో రూ. 8 వేల-రూ. 26 వేల వరకు పెరిగే ఛాన్స్ ఉంది.
కాగా, ఉద్యోగుల జీతం, పెన్షనరీ ప్రయోజనాల అమలు కోసం సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉంది. గతంలో 5వ సెంట్రల్ పే కమిషన్ (సీపీసీ) సిఫారసుల అమలు కోసం 19 నెలల సమయం పట్టింది. 6వ సీపీసీ అమలు కోసం 32 నెలలు వేచి చూడాల్సి వచ్చింది. అయితే, 7వ సీపీసీ సిఫారసులు గడువు తేది నుంచి 6 నెలల లోపు అమలు చేశారు. ఈ సిఫారసులకు జూన్ 2016లో అప్పటి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇక 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. ఎప్పుడు అమల్లోకి వస్తాయో చూడాలి అంటున్నారు.