iDreamPost
android-app
ios-app

విద్యార్థుల కోసం ICICI స్పెషల్ కార్డ్‌! ఇక నిర్భయంగా చదువుకోవచ్చు!

  • Published Jul 03, 2024 | 12:06 PM Updated Updated Jul 03, 2024 | 12:07 PM

ICICI Sapphiro Forex Card: మీరు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారా. అయితే మీలాంటి వారి కోసం ఐసీఐసీఐ బ్యాంక్ సఫిరో ఫారెక్స్ కార్డును ప్రారంభించింది. ఈ కార్డుతో కలిగే ప్రయోజనాలివే.

ICICI Sapphiro Forex Card: మీరు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారా. అయితే మీలాంటి వారి కోసం ఐసీఐసీఐ బ్యాంక్ సఫిరో ఫారెక్స్ కార్డును ప్రారంభించింది. ఈ కార్డుతో కలిగే ప్రయోజనాలివే.

విద్యార్థుల కోసం ICICI స్పెషల్ కార్డ్‌! ఇక నిర్భయంగా చదువుకోవచ్చు!

ఇటీవలికాలంలో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్నది. తమ పిల్లలను ఫారిన్ లో చదివించేందుకు తల్లిదండ్రులు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. విదేశాల్లో విద్యనభ్యసించి జాబ్ సాధిస్తే లక్షల్లో జీతాలు అందుకోవచ్చని భావిస్తుంటారు. విద్యార్థులు సైతం ఉన్నత చదువుల కోసం ఫారిన్ వెళ్లేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా ఫారిన్ లో ఉన్నత విద్య చదివేందుకు వెల్లే విద్యార్థులకు ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ గుడ్ న్యూస్ అందించింది. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రీ-పెయిడ్‌ సఫిరో ఫారెక్స్‌ కార్డును ప్రారంభించింది. ఈ కార్డుతో విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు ఇవే.

ఐసీఐసీఐ బ్యాంక్‌ మంగళవారం ఓ ప్రీ-పెయిడ్‌ ఫారెక్స్‌ కార్డును పరిచయం చేసింది. ఫారిన్ లో ఉన్నత విద్య అంటే చాల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ నేపథ్యంలోనే విదేశాల్లో చదువు సంబంధిత ఖర్చులను అధిగమించడానికి విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకూ తమ సఫిరో కార్డు ఎంతో సౌకర్యవంతంగా, ప్రయోజనకరంగా ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. కాలేజ్ అడ్మీషన్‌ ఫీజులు, కోర్సు సంబంధిత చెల్లింపులతోపాటు ప్రయాణం, భోజనం, కిరాణా ఇతర రోజువారీ ఖర్చులకు సఫిరో ఫారెక్స్‌ కార్డు ఉపయోగపడుతుందని ఓ ప్రకటనలో బ్యాంక్‌ తెలిపింది. సఫిరో ఫారెక్స్‌ కార్డ్‌ తో విద్యార్థులకు మరిన్ని ప్రయోజనాలు కలుగనున్నాయి.

ఐసీఐసీఐ సఫిరో ఫారెక్స్‌ కార్డు వినియోగదారులు 15 దేశాల కరెన్సీల్లో ట్రాన్సాక్షన్స్ ను ఎలాంటి చార్జీలు లేకుండానే చేసుకోవచ్చు. కేవలం ఒక్క కరెన్సీకి చెందిన నగదే ఉన్నా.. విద్యార్థులకు వరల్డ్ వైడ్ గా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. కస్టమర్లకు ఒక ప్రైమరీ కార్డుతోపాటు ఓ రీప్లేస్‌మెంట్‌ కార్డును ఐసీఐసీఐ ఇస్తుంది. ప్రైమరీ కార్డు పోయినప్పుడు/పాడైపోయినప్పుడు ఐమొబైల్‌ పే, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లేదా బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేయడం ద్వారా రీప్లేస్‌మెంట్‌ కార్డును యాక్టివేట్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.