iDreamPost
android-app
ios-app

Credit Card వాడే వారికి బిగ్ షాక్.. ఛార్జీల్లో భారీ మార్పులు.. ఎంత పెరిగాయంటే?

క్రెడిట్ కార్డులు వాడేవారికి షాకిచ్చింది ప్రముఖ బ్యాంకు. క్రెడిట్ కార్డులపై జాయినింగ్ ఫీజు, యాన్యువల్ పీజుల్లో భారీ మార్పులు చేసింది. ఏ కార్డుపై ఎంత పెరిగాయంటే?

క్రెడిట్ కార్డులు వాడేవారికి షాకిచ్చింది ప్రముఖ బ్యాంకు. క్రెడిట్ కార్డులపై జాయినింగ్ ఫీజు, యాన్యువల్ పీజుల్లో భారీ మార్పులు చేసింది. ఏ కార్డుపై ఎంత పెరిగాయంటే?

Credit Card వాడే వారికి బిగ్ షాక్.. ఛార్జీల్లో భారీ మార్పులు.. ఎంత పెరిగాయంటే?

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన పలు బ్యాంకులు కస్టమర్లకు క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. అత్యవసర సమయాల్లో ఉపయోగకరంగా ఉండడంతో క్రెడిట్ కార్డు యూజర్స్ కూడా పెరిగిపోయారు. రిచ్, పూర్ అనే తారతమ్యం లేకుండా క్రెడిట్ కార్డులను తీసుకుని వాడేస్తున్నారు. బ్యాంకులు కూడా శాలరీతో సంబంధం లేకుండా క్రెడిట్ కార్డులను ఇచ్చేస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డులు వాడే వారికి బిగ్ షాక్ ఇచ్చింది ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ. పలు రకాల క్రెడిట్ కార్డులపై ఛార్జీలు, ఇతర ఫీజుల్లో భారీ మార్పులు చేసింది. ఏ కార్డుపై ఎంతవరకు ఛార్జీలు పెరిగాయంటే?

ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతున్న ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు షాకిచ్చింది. ప్లాటినమ్, కోరల్, రుబిక్స్, సఫ్పిరో వంటి క్రెడిట్ కార్డులపై ఛార్జీలు, ఇతర ఫీజుల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. న్యూ ఛార్జీలు మార్చి 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. జాయినింగ్ ఫీ, వార్షిక ఫీ లేని కార్డులపై ఎలాంటి ప్రయోజనాలు ఉండబోవని వెల్లడించింది. క్రెడిట్ కార్డులపై కొత్త ఛార్జీలు ఎలా ఉన్నాయంటే?

ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డు:

  • ఈ క్రెడిట్ కార్డు జాయినింగ్ ఫీ రూ.12,499 చెల్లించాలి. ఫస్ట్ ఇయర్ యాన్యువల్ ఫీ ఏమీ వసూలు చేయరు. సెకండ్ ఇయర్ నుంచి రూ.12,499గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్డు హోల్డర్స్ యాన్యువల్ ఫీ రిఫండ్ పొందాలంటే రూ.1 లక్ష ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఎమరాల్డ్ ప్రైవేట్ క్రెడిట్ కార్డు

  • ఈ క్రెడిట్ కార్డు యాన్యువల్ ఫీ రూ.12 వేలుగా ఉంది. ఈ కార్డుపై కూడా మొదటి సంవత్సరం ఎలాంటి వార్షిక ఫీజు ఉండదు. కానీ రెండో సంవత్సరం నుంచి రూ. 12 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు రిఫండ్ కావాలంటే రూ. 1.5 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది.

సఫ్పిరో క్రెడిట్ కార్డు

  • ఈ క్రెడిట్ కార్డుపై ప్రవేశ రుసుము రూ.6,500 కొత్త ఛార్జీని ప్రకటించింది. మొదటి ఏడాది యాన్యువల్ ఫీ ఉండదు.. ఆ తర్వాత ఇయర్ నుంచి రూ.3500 చెల్లించాలి. ఈ ఫీజు రిఫండ్ పొందాలంటే రూ.6 లక్షలు ఖర్చు చేయాలి.

బ్యాంక్ రుబిక్స్ క్రెడిట్ కార్డు:

  • ఈ క్రెడిట్ కార్డుపై జాయినింగ్ ఫీ రూ.3 వేలుగా ఉంది. రెండో ఏడాది నుంచి రూ.2 వేలు యాన్యువల్ ఫీ కట్టాలి. రూ.3 లక్షలు చెల్లిస్తే ఈ ఫీజు రిఫండ్ వస్తుంది.

కోరల్ క్రెడిట్ కార్డు:

  • ఈ క్రెడిట్ కార్డుపై జాయినింగ్ ఫీ రూ.300 ఉంది. రెండో ఏడాది నుంచి వార్షిక రుసుములు రూ.500 కట్టాలి. రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తే ఈ ఫీ రిఫండ్ అవుతుంది.
  • హెచ్‌పీసీఎల్ ప్లాటినం క్రెడిట్ కార్డు, టైటానియం క్రెడిట్ కార్డు, హెచ్‌పీసీఎల్ కోరల్ కార్డుల జాయినింగ్ ఫీ రూ.199గా ఉండగా.. రెండో ఏడాది నుంచి వార్షిక రుసుములు రూ.199 చెల్లించాలి. అయితే రూ.50 వేలు ఖర్చు చేస్తే రిఫండ్ పొందొచ్చు.