iDreamPost
android-app
ios-app

ICICI బ్యాంకుకి RBI షాక్‌..ఏకంగా రూ.1 కోటి జరిమానా! కారణం ఇదే!

  • Published May 28, 2024 | 1:41 PMUpdated May 28, 2024 | 1:41 PM

దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంకు కూడా ఒకటి. అయితే తాజాగా ఈ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏకంగా రూ.1 కోటి మానీటరీ పెనాల్టీ విధించింది. ఎందుకంటే..

దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంకు కూడా ఒకటి. అయితే తాజాగా ఈ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏకంగా రూ.1 కోటి మానీటరీ పెనాల్టీ విధించింది. ఎందుకంటే..

  • Published May 28, 2024 | 1:41 PMUpdated May 28, 2024 | 1:41 PM
ICICI బ్యాంకుకి RBI షాక్‌..ఏకంగా రూ.1 కోటి జరిమానా! కారణం ఇదే!

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) తమ నిబంధనలను అత్రికమించిన  ఏ బ్యాంకు పై  అయిన సరే  త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఈ క్ర‌మంలోనే..  ఆర్‌బీఐ తమ నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులకు లైసెన్స్‌ ను సైతం రద్దు చేయడంలో వెనుకాడదు. అంతేకాకుండా.. భారీ మొత్తంలో జరిమానాలు కూడా విధిస్తుంది. ఇప్పటికే పలు బ్యాంకులకు గతంలో ఆర్‌బీఐ తమ నిబంధనలను వ్యతిరేకించేందుకు భారీ   మొత్తంలో జరిమానా విధించింది. అయితే తాజాగా మరో బ్యాంకుకు కూడా ఆర్బిఐ త‌మ నిబంధ‌న‌ల‌ను  ఉల్లంఘించేందుకు ఏకంగా రూ. 1కోటి జరిమానా విధించింది. ఇంతకి ఏ బ్యాంకు అంటే..

దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంకు కూడా ఒకటి. అయితే తాజాగా ఈ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏకంగా రూ.1 కోటి మానీటరీ పెనాల్టీ విధించింది. అయితే రుణాలు, అడ్వాన్సులకు సంబంధించిన పలు మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైన క్రమంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు మే 21, 2024 రోజునే ఐసీఐసీఐ బ్యాంకుకు ఆర్‌బీఐ ఈ జరిమానా వేసినట్లు తెలిపింది. అయితే బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లోని పలు నిబంధనల ప్రకారం.. ఐసీఐసీఐ బ్యాంకుపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

కాగా, ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్చేంజీ ఫైలింగ్ ప్రకారం.. ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 21, 2024 రోజున ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్ పై కోటి రూపాయల మానీటరీ పెనాల్టీ విధించింది. అయితే ఇందులో లోన్స్‌, అడ్వాన్సులకు సంబంధించిన చట్టబద్ధమైన, ఇతర ఆంక్షలను పాటించడంలో విఫలమైన నేపథ్యంలో ఈ మేరకు మానీటరీ పెనాల్టీ విధించింది.’ అని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. ఇక మార్చి 31, 2022 నుంచి బ్యాంకు ఆర్థిక పరిస్థితులపై ఆర్‌బీఐ తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైనట్లు తేలింది.

దీంతో ఆర్‌బీఐ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ సమస్యను పరిష్కరించుకోవాలని బ్యాంకుకు ఆర్‌బిఐ సమయం కూడా ఇచ్చింది. కానీ, ప్రాజెక్టు రిపోర్టులు, ఆర్థిక పరిస్థితులను పరిశీలించకుండానే పలు సంస్థలకు టర్మ్ లోన్స్ ఇచ్చినట్లు ఆర్‌బీఐ గుర్తించింది. ఇక ఈ మానీటరీ పెనాల్టీ అనేది బ్యాంకు, కస్టమర్ల సర్వీసలపై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్‌బీఐ తెలిపింది. మరి, ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లఘించేందుకు గాను ఐసీఐసీఐ బ్యాంకు పై ఏకంగా రూ.1 కోటి మానీటరీ పెనాల్టీ విధించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి