iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌వాసులకు భారీ బంపరాఫర్‌.. రూ.25కే కిలో ఉల్లిగడ్డలు

  • Published Nov 01, 2023 | 10:20 AM Updated Updated Nov 01, 2023 | 10:20 AM

ఉల్లి ధరలు మండి పోతున్నాయి. సెంచరీకి చేరువలో ఉన్నాయి. మరి కొన్ని రోజుల పాటు ఉల్లి ధరలు ఇలానే కొనసాగుతాయని అంటున్నారు. ఈ క్రమంలో ఓ చోట మాత్ర 25 రూపాయలకే కిలో ఉల్లిపాయలు అమ్ముతున్నారు. ఆ వివరాలు..

ఉల్లి ధరలు మండి పోతున్నాయి. సెంచరీకి చేరువలో ఉన్నాయి. మరి కొన్ని రోజుల పాటు ఉల్లి ధరలు ఇలానే కొనసాగుతాయని అంటున్నారు. ఈ క్రమంలో ఓ చోట మాత్ర 25 రూపాయలకే కిలో ఉల్లిపాయలు అమ్ముతున్నారు. ఆ వివరాలు..

  • Published Nov 01, 2023 | 10:20 AMUpdated Nov 01, 2023 | 10:20 AM
హైదరాబాద్‌వాసులకు భారీ బంపరాఫర్‌.. రూ.25కే కిలో ఉల్లిగడ్డలు

కూరగాయల ధరలు కూడా సామాన్యుల చేత కన్నీరు పెట్టిస్తున్నాయి. మొన్నటి వరకు టమాటా ధర పెరిగి.. బాబోయ్‌ అనిపిస్తే.. ప్రస్తుతం ఆ జాబితాలోకి ఉల్లిపాయలు చేరి.. జనాల చేత కన్నీరు పెట్టిస్తున్నాయి. పది రోజుల వరకు కిలో ఉల్లి ధర 20 రూపాయల వరకు ఉండగా.. ప్రస్తుతం అది రాకెట్‌లా దూసుకుపోతుంది. త్వరలోనే ఉల్లి ధర సెంచరీ కొట్టబోతుంది. ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో.. మార్కెట్‌లో ఉల్లి కొరత ఏర్పడింది. మరి కొన్ని రోజుల పాటు ఉల్లి ధరలు ఇలానే ఉంటాయని అంటున్నారు. ఆదివారం నాడు ఢిల్లీ మార్కెట్‌లో అత్యధికంగా కిలో ఉల్లి ధర 83 రూపాయలు పలికింది.

ఉల్లి ధరలు భారీగా పెరిగిపోవడంతో ధరలను అదుపు చేసేందుకు నేషనల్‌ కో ఆపరేటివ్‌ కన్జ్యూమర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో.. కిలో ఉల్లిపాయలు 25 రూపాయలకే అమ్మడం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో ఈ సబ్సిడీ ధరలకు ఉల్లిపాయల విక్రయాలను చేపట్టారు. ఉల్లి ధరలు దిగి వచ్చే వరకు ఇలానే అమ్ముతామని తెలిపారు. కిలో ఉల్లి ధర 100 రూపాయలకు చేరువకాడంతో.. సదరు సంస్థ తీసుకున్న నిర్ణయంపై జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉల్లి పంట ఉత్పత్తి తగ్గిపోయిందని.. ఆ కారణంగానే దేశంలో ఉల్లి కొరత ఏర్పడిందని చెబుతున్నారు. ఇదే కాక కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలో కురిసిన జోరు వానల కారణంగా ఉల్లి పంట నాశనం అయ్యింది. అందుకే ప్రస్తుతం మార్కెట్‌లో ఉల్లి ధరలు మండి పోతున్నాయిని అంటున్నారు. మరో రెండు నెలల పాటు ఉల్లి ధరలు ఇలానే కొనసాగుతాయి అంటున్నారు.