iDreamPost
android-app
ios-app

ఇళ్లు, ప్లాట్స్ కొనేందుకు HYDలో ఈ జిల్లాలే టాప్.. భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లు

  • Published May 15, 2024 | 3:45 PM Updated Updated May 15, 2024 | 4:44 PM

హైదరాబాద్ లో ఇండ్ల స్థలాలు, ఇండ్ల కొనుగోళ్లు అనేవి ప్రతి చోటా జరుగుతాయి. కానీ హైదరాబాద్ లో ఈ రెండు జిల్లాల్లో మాత్రం ఎక్కువ మంది ప్రాపర్టీలు కొనుగోలు చేస్తున్నారు. మరి ఆ జిల్లాలేంటో తెలుసుకోండి.

హైదరాబాద్ లో ఇండ్ల స్థలాలు, ఇండ్ల కొనుగోళ్లు అనేవి ప్రతి చోటా జరుగుతాయి. కానీ హైదరాబాద్ లో ఈ రెండు జిల్లాల్లో మాత్రం ఎక్కువ మంది ప్రాపర్టీలు కొనుగోలు చేస్తున్నారు. మరి ఆ జిల్లాలేంటో తెలుసుకోండి.

ఇళ్లు, ప్లాట్స్ కొనేందుకు HYDలో ఈ జిల్లాలే టాప్.. భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్ నగరం.. రియల్ ఎస్టేట్ కి అనుకూలంగా ఉండడంతో ఇక్కడ మధ్యతరగతి వారి నుంచి ధనవంతుల వరకూ అనేక మంది పెట్టుబడులు పెడుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగరం రూపుదిద్దుకోవడంతో రియల్ ఎస్టేట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో భారీగా రిజిస్ట్రేషన్స్ నమోదు అవుతున్నాయి. ప్రభుత్వ విధానాలు ప్రోత్సాహకరంగా ఉండడం కూడా రియల్ ఎస్టేట్ ఇంత బాగా నడుస్తుండడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే క్రెడాయ్ హైదరాబాద్ సంస్థ గత మార్చి నెలలో నిర్వహించిన ప్రాపర్టీ షోలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని.. రెసిడెన్షియల్, బిజినెస్, రిటైల్ రియల్ ఎస్టేట్ లో గణనీయమైన వృద్ధి సాధించిందని వెల్లడించింది.   

2023 ఆగస్టు నెల నుంచి నవంబర్ వరకూ 2,06,849 రిజిస్ట్రేషన్లు జరగగా.. అదే ఏడాది డిసెంబర్ నుంచి మార్చి 2024 వరకూ 2,14,217 ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరిగాయని తేల్చింది. ఈ 3 నెలల్లో 7,368 రిజిస్ట్రేషన్లు పెరిగినట్లు క్రెడాయ్ తెలిపింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రిజిస్ట్రేషన్లు భారీగా పెరగడం గమనార్హం అని సంస్థ పేర్కొంది. హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. వికారాబాద్ జిల్లా కూడా నగర రియల్ ఎస్టేట్ లో భాగమైంది. ఈ జిల్లాల పరిధిలో 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి వరకూ ఈ నెలల్లో ఇండ్ల స్థలాలు, ఇండ్ల డాక్యుమెంట్స్ కి సంబంధించి నెలకు సగటున 53,554 రిజిస్ట్రేషన్స్ జరిగాయి.

ఈ జిల్లాలే టాప్:

అంతకు ముందు 4 నెలల్లో సగటున నెలకు 51,712 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. అయితే హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ఈ జిల్లాలన్నిటిలోనూ ఎక్కువ రిజిస్ట్రేషన్లు రెండు జిల్లాల్లో జరుగుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లోనే రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరుగుతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న జిల్లాలన్నీ కలిపితే ఈ రెండు జిల్లాలు లావాదేవీల్లో 60 శాతానికి పైగా వాటా కలిగి ఉన్నాయని క్రెడాయ్ పేర్కొంది. 2024 మార్చి నెలలో హైదరాబాద్ లో 4,376 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరగగా.. ప్రభుత్వానికి 120.53 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇదే నెలలో రంగారెడ్డిలో 19,663 రిజిస్ట్రేషన్లు జరగగా 432.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక మేడ్చల్ లో 13,051, సంగారెడ్డిలో 6109 రిజిస్ట్రేషన్లు, యాదాద్రిలో 4951 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్, సిద్ధిపేటలో 3598, మెదక్ లో 1452, వికారాబాద్ లో 1399 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్స్ జరిగినట్టు క్రెడాయ్ తెలిపింది.