P Venkatesh
Lectrix LXS 2.0: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 49 వేలకే బెస్ట్ ఈవీ అందుబాటులో ఉంది. సింగిల్ ఛార్జ్ తో 100 కి.మీలు ప్రయాణించొచ్చు.
Lectrix LXS 2.0: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 49 వేలకే బెస్ట్ ఈవీ అందుబాటులో ఉంది. సింగిల్ ఛార్జ్ తో 100 కి.మీలు ప్రయాణించొచ్చు.
P Venkatesh
రాను రాను ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు ఆదరణ పెరుగుతోంది. పెట్రోల్ ఖర్చులు తగ్గించుకునేందుకు ఈవీలను ఆశ్రయిస్తున్నారు వాహనదారులు. డ్రైవ్ చేసేందుకు అనుకూలంగా ఉండడం బడ్జెట్ ధరల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లు, కార్లు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఇక కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు సైతం ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ లెక్ట్రిక్స్ కు చెందిన ఈవీపై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. కేవలం 49 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ను సొంతం చేసుకోవచ్చు.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో గోట్ సేల్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్ లో లెక్ట్రిక్స్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0 ఈవీని రూ. 49,999 కే దక్కించుకోవచ్చు. దేశంలోనే చీపెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. దీనికి మించిన డీల్ ఉండదేమో. ఈ మధ్యకాలంలో ఈవీని కొనాలనుకునే వారు లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0 ను తీసుకోవడం బెస్ట్ అంటున్నారు నిపుణులు.ఈ స్కూటర్ కొనుగోలు చేసినట్లయితే బ్యాటరీపై జీవితకాల వారంటీని సైతం పొందొచ్చు. ఇందుకోసం కస్టమర్లు బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి.
లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0 స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ గరిష్ఠ వేగం గంటకు 50 కిలోమీటర్లు. ఇందులో 93 గేమ్ ఛేంజింగ్ ఫీచర్లు, 24 స్మార్ట్ ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ట్యూబ్ లెస్ టైర్లతో వస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీని అందించారు. 2.3 కేడబ్ల్యూహెచ్ కెపాసిటీతో వస్తుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి 4 గంటల సమయం పడుతుంది. ఇందులో ఎస్ఓఎస్ బటన్ ఇచ్చారు. అలాగే లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ లో యాంటీ థెఫ్ట్ అలారం, హెల్మెట్ వార్నింగ్, సైడ్ స్టాండ్ అలారం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.