nagidream
బంగారు నగలు కొనేటప్పుడు గానీ తయారు చేయించుకునే సమయంలో గానీ నగ ధర ఎంత? తరుగు ఎంత? ఇవే చూసుకుంటారు. అయితే బంగారు ఆభరణాలు చేసినప్పుడు తరుగు ఎందుకు వస్తుంది? ఎంత మేర వస్తుంది? తరుగుని ఎలా లెక్కిస్తారు? అసలు ఎంత తరుగు తీసుకోవాలి? వంటి లెక్కలు ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారు నగలు కొనేటప్పుడు గానీ తయారు చేయించుకునే సమయంలో గానీ నగ ధర ఎంత? తరుగు ఎంత? ఇవే చూసుకుంటారు. అయితే బంగారు ఆభరణాలు చేసినప్పుడు తరుగు ఎందుకు వస్తుంది? ఎంత మేర వస్తుంది? తరుగుని ఎలా లెక్కిస్తారు? అసలు ఎంత తరుగు తీసుకోవాలి? వంటి లెక్కలు ఇప్పుడు తెలుసుకుందాం.
nagidream
బంగారం స్వచ్ఛతను 0 నుంచి 24 క్యారెట్ల రూపంలో కొలుస్తారు. 24 క్యారెట్ గోల్డ్ అంటే 99.99 శాతం స్వచ్ఛమైన బంగారం అని అర్థం. ఈ బంగారంలో స్వల్ప మోతాదులో ఇతర లోహాలు ఉంటాయి. అయితే ఈ 24 క్యారెట్ బంగారం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ కారణంగా ఆభరణాలు తయారు చేయడం కష్టమవుతుంది. అందుకే గట్టితనం కోసం రాగి, వెండి, జింక్, కాడ్మియం వెంటి లోహాలను మిక్స్ చేస్తారు. ఈ లోహాలు ఎంత శాతం అయితే కలుస్తాయో అనే దాని మీద బంగారం స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది. ఈ లోహాల శాతం ఎక్కువ ఉంటే ఆ బంగారాన్ని 22 క్యారెట్ల బంగారంగా, ఇంకా ఎక్కువగా ఉంటే 18 క్యారెట్ల బంగారంగా నిర్ణయిస్తారు.
22 క్యారెట్ల బంగారంలో 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగతా 8.4 శాతం ఇతర లోహాలు కలుస్తాయి. దీన్నే 916 కేడీఎం గోల్డ్ అని 91.6 కేడీఎం గోల్డ్ అని అంటారు. 18 క్యారెట్లు అంటే 75 శాతం మాత్రమే స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగతా 25 శాతం లోహాలు ఉంటాయి. 14 క్యారెట్లు, 12 క్యారెట్లు, 10 క్యారెట్ల బంగారం కూడా ఉంటుంది. 14 క్యారెట్స్ లో 58.5%, 12 క్యారెట్స్ లో 50%, 10 క్యారెట్ల బంగారంలో 41.7% మాత్రమే స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగతా శాతం మొత్తం ఇతర లోహాలు ఉంటాయి. అయితే బంగారంలో ఏ లోహం ఎంత కలిపారు అనే దాని మీద బంగారు ఆభరణం రంగు ఆధారపడి ఉంటుంది. బంగారం స్వచ్ఛతను బట్టి నునుపు, మెరుపు, రంగు ఉంటాయి. వీటిని బట్టే బంగారం స్వచ్ఛతను గుర్తిస్తారు. 24 క్యారెట్ల బంగారం మెరిసినంతగా 22 క్యారెట్ల బంగారం మెరవదు.మెరుపు తక్కువగా ఉండడంతో పాటు కొంచెం నల్ల రంగులో ఉంటుంది. బంగారానికి కలిపే లోహాలను బట్టి రంగు మారుతుంది.
రెడీమేడ్ ఆభరణాలు కొన్నా లేదా నగలు చేయించుకున్నా గానీ బంగారం రేటుతో పాటు తరుగు, మజూరిపై ఆరాలు తీస్తారు. బంగారు ఆభరణాలు చేసేటప్పుడు బంగారాన్ని కాల్చడం, కరిగించడం, సుత్తితో కొట్టడం, మిషన్లపై తీగలుగా మార్చడం, వివిధ డిజైన్స్ లోకి మార్చడం, మెరుగు పెట్టడం వంటివి చేస్తారు. ఈ ప్రక్రియలో స్వల్పంగా బంగారం అనేది వృధా అవుతుంది. దీన్నే తరుగు లేదా వేస్టేజ్ అని అంటారు. ఉదాహరణకు 10 గ్రాముల బంగారంతో ఉంగరం చేయించాలని అనుకుంటే.. మజూరి (తయారీ ఛార్జీలు) కింద 200 మిల్లీ గ్రాములు, తరుగు కింద 200 మిల్లీ గ్రాముల బంగారం పోతుంది. అంటే మొత్తం 400 మిల్లీ గ్రాముల బంగారం పోతుంది.
బంగారు వస్తువు తయారీలో 10 గ్రాములకు 70 మిల్లీ గ్రాముల బంగారం కరిగించినప్పుడు పోయే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత బంగారాన్ని రాపడం, డిజైన్ చెక్కడం, మెరుగు పెట్టడం వంటివి చేసినప్పుడు 15 నుంచి 30 మిల్లీ గ్రాముల బంగారం తరుగు రూపంలో పోతుంది. 22 కేడీఎం హాల్ మార్క్ ఉంగరం అంటే 22 క్యారెట్ 10 గ్రాముల ఉంగరం తయారు చేయడానికి 2 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. హ్యాండ్ వర్క్, మిషన్ మీద చేసినప్పుడు 200 మిల్లీ గ్రాముల బంగారం పోతుంది. తయారు చేసినందుకు స్వర్ణకారుడు 200 మిల్లీ గ్రాముల బంగారం తీసుకుంటాడు. మొత్తం మీద 10 గ్రాముల బంగారం మీద 400 మిల్లీ గ్రాముల బంగారం తరుగు, మజూరీకి పోతాయి. 10 గ్రాముల బంగారం ఇచ్చి వస్తువు చేయించుకుంటే అందులో 9.6 గ్రాముల బంగారమే ఉంటుంది. కానీ దాని బరువు మాత్రం 10.44 గ్రాములు ఉంటుంది. ఎందుకంటే మిగతా 8.4 శాతం ఇతర లోహాలు కలుపుతారు.
స్వర్ణకారుడి దగ్గరే కాదు బంగారు దుకాణాల్లో కొన్నా ఇలానే జరుగుతుంది. 10 గ్రాముల బంగారం వద్ద 400 మిల్లీ గ్రాములు తరుగు, మజూరీ కింద పోతుంది. అయితే డిజైన్లు, స్టోన్ వర్క్ ఎక్కువ ఉండే బంగారు ఆభరణాల విషయంలో మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆభరణాలకు పెట్టిన రాళ్ళ బరువును కూడా బంగారం అనే అంటారు. ఉదాహరణకు ఆభరణం బరువు 25 గ్రాములు ఉంటే.. అందులో 5 గ్రాములు రాళ్లు ఉన్నాయనుకోండి. ఆ రాళ్ల బరువును కూడా బంగారం ధరకే లెక్కిస్తారు. దీని వల్ల మోసపోయే ఛాన్స్ ఉంది. తరుగు, మజూరీ ఛార్జీలు లేవని చెప్పి రాళ్లను బంగారం ధరకు లెక్కించి మోసం చేస్తారు. తరుగు, మజూరీ వల్ల 400 మిల్లీ గ్రాముల బంగారం కోల్పోతే.. రాళ్ల వల్ల 5 గ్రాముల బంగారం నష్టపోయినట్టే.
బంగారు ఆభరణాల్లో రాళ్ళ ఖరీదు వెయ్యి రూపాయల నుంచి 2 వేల వరకూ ఉంటాయి. ఈ రేటు కాకుండా బంగారం ధరనే రాళ్ల బరువుకి వేసి మీకు అంటగడదామాని చూస్తారు. దీని వల్ల మీరు చాలా నష్టపోతారు. తరుగు అయినా, మజూరీ అయినా మీరు బంగారంతో వస్తువు చేయించుకున్నా లేదా బంగారు నగల దుకాణంలో రెడీమేడ్ ఆభరణం కొనుగోలు చేసినా తరుగు కింద 200 మిల్లీగ్రాములు, మజూరీ అంటే మేకింగ్ ఛార్జెస్ కింద 200 మిల్లీ గ్రాములు మాత్రమే బంగారం పోతుంది. ఇంతకంటే ఎక్కువ పోతుందంటే మీరు మోసపోతున్నట్టు లెక్క. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి మీరు బంగారు ఆభరణం కొన్నా.. లేదా బంగారు వస్తువు చేయించుకున్నా మీ ప్రాంతంలో స్వర్ణకారుడు లేదా షాపు వాళ్ళు తరుగు, మజూరీ కింద ఎంత బంగారం తీసుకుంటున్నారో కామెంట్ చేయండి.