iDreamPost
android-app
ios-app

Home Loan: హోం లోన్ భారంతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ టిప్స్‌తో EMI తగ్గించుకోవచ్చు!

  • Published Apr 12, 2024 | 1:21 PM Updated Updated Apr 12, 2024 | 1:21 PM

హోం లోన్ భారంతో విసిగిపోయారా.. ఈఎంఐ టెన్షన్ మిమ్మల్ని వేధిస్తుందా.. అయితే ఈ చిట్కాలు పాటిస్తే.. హోం లోన్ భారం నుంచి బయటపడవచ్చు. ఆ వివరాలు..

హోం లోన్ భారంతో విసిగిపోయారా.. ఈఎంఐ టెన్షన్ మిమ్మల్ని వేధిస్తుందా.. అయితే ఈ చిట్కాలు పాటిస్తే.. హోం లోన్ భారం నుంచి బయటపడవచ్చు. ఆ వివరాలు..

  • Published Apr 12, 2024 | 1:21 PMUpdated Apr 12, 2024 | 1:21 PM
Home Loan: హోం లోన్ భారంతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ టిప్స్‌తో EMI తగ్గించుకోవచ్చు!

నేటి కాలంలో బ్యాంకు నుంచి లోన్ తీసుకోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇక చిన్నాచితకా ఉద్యోగాలు చేసే వారు కచ్చితంగా ఏదో ఒక సందర్భంలో బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. ఇక సాధారణంగా ఉద్యోగులైనా.. సామాన్య ప్రజలైనా బ్యాంకు నుంచి కచ్చితంగా తీసుకునే రుణాల్లో ముఖ్యమైంది హోమ్ లోన్. నేటి కాలంలో బ్యాంక్ నుంచి రుణం తీసుకోకుండా ఇల్లు కట్టడం అనేది దాదాపు అసాధ్యం. ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులు భారీ మొత్తంలోనే లోన్ ఇస్తాయి. ప్రతి నెల ఈఎంఐ చెల్లించాలి. ఇది చాలా ఏళ్ల పాటు ఉంటుంది. మరి మీరు కూడా హోం లోన్ భారంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ కింద చెప్పే టిప్ప్ ఫాలో అయితే.. ఈఎంఐ తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల మరోసారి రెపో రేటును స్థిరంగా ఉంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల హోం లోన్ ఈఎంఐ తగ్గే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఆర్బీఐ ఏడాదిన్నర వ్యవధిలో 4-6.50 శాతానికి అంటే ఏకంగా 250 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచింది. దీంతో హోం లోన్, పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు భారీగా పెరిగాయి. రెపో రేటు తగ్గితేనే ఈ హోం లోన్ వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే.. హోం లోన్ తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు పడేవారు.. ఈ చిట్కాలు పాటిస్తే.. ఆ భారం తగ్గడమే కాక ఈఎంఐని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు.

హోం లోన్ ఈఎంఐ తగ్గించుకోండిలా..

హోం లోన్ ఈఎంఐ తగ్గించుకోవడం కోసం.. కస్టమర్లు.. బ్యాలెన్స్ బదిలీ ఆప్షన్లను వెతకడం, లోన్ తీసుకున్న బ్యాంక్ లతో చర్చలు జరుపుతుండటం, ముందస్తు చెల్లింపులు చేయడం వంటి చర్యలతో రుణ బాధల నుంచి త్వరగా విముక్తి పొందవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఆర్బీఐ రెపో రేటు పెరిగినప్పుడు.. బ్యాంకులు ఆయా లోన్ల వడ్డీ రేట్లు పెంచుతుంటాయి. అదే దాన్ని తగ్గిస్తే.. ఈ లోన్ రేట్లు కూడా తగ్గి కస్టమర్లకు ప్రయోజనం కలుగుతుంది. కనుక రెపో రేటు పెంచిన సమయంలో లోన్ తీసుకోకపోవడమే ఉత్తమం అంటున్నారు.

ఒకవేళ మీరు ఇప్పటికే హోం లోన్ తీసుకొని ఉంటే గనుక.. మీరు రుణం తీసుకున్న సంస్థ కన్నా తక్కువ వడ్డీ ఆఫర్ చేస్తోన్న ఇతర బ్యాంక్, ఆర్థిక సంస్థలు ఏవైనా ఉన్నాయేమో కనుక్కొండి. అప్పుడు మీ హోం లోన్ ను.. తక్కువ వడ్డీ రేటు ఇచ్చే సంస్థలకు బదిలీ చేసుకునే అవకాశం ఉంది. కాక పోతే ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

ఇంకొన్నిసార్లు, రుణదాతలు.. వడ్డీ రేట్లపై చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉంటారు. అలానే ఇప్పుడు ఉన్న కస్టమర్లను కాపాడుకునుకేందుకు వారి కోసం స్పెషల్ స్కీమ్స్ తీసుకొస్తారు. మీకు కూడా ఇలాంటి ఆఫర్లు ఏవైనా వర్తిస్తాయోమో చూసుకొండి. అందుకోసం మీరు ప్రస్తుతం లోన్ తీసుకున్న బ్యాంక్, సంస్థతో చర్చలు జరపడం ఉత్తమం అంటున్నారు మార్కెట్ నిపుణులు.

మీ దగ్గర సేవింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ మొత్తాన్ని మీరు హోం లోన్‌ ప్రీపేమెంట్స్ చేయడం కోసం వినియోగిస్తే మంచిది. ఇది మీరు బాకీ ఉన్న ప్రిన్సిపల్ మొత్తాన్ని తగ్గిస్తుంది. దీంతో లోన్ ఈఎంఐ మొత్తం, లోన్ కాలవ్యవధిని తగ్గించుకునేందుకు అవకాశం లభిస్తుంది.

లోన్ కాలవ్యవధిని పొడిగించడం వల్ల కూడా మీ ఈఎంఐ భారం తగ్గుతుంది. అయితే ఇలా చేస్తే మీరు సుదీర్ఘకాలం లోన్ ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. దాంతో వడ్డీ భారం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ప్రతి నెల చెల్లించే ఈఎంఐ మొత్తం తగ్గుతుంది.