iDreamPost
android-app
ios-app

హార్లిక్స్‌ లేబుల్‌ తొలగింపు..కారణం ఏంటంటే?

  • Published Apr 25, 2024 | 3:50 PM Updated Updated Apr 25, 2024 | 3:50 PM

Hindustan Unilever Horlick: ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి హార్లిక్స్ తన కేటగిరి మార్చింది. హెల్త్ ఫుడ్ డ్రింక్స్ నుంచి ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్ కేటగిరిలోకి మార్చుతున్నట్లు ప్రకటించింది.

Hindustan Unilever Horlick: ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి హార్లిక్స్ తన కేటగిరి మార్చింది. హెల్త్ ఫుడ్ డ్రింక్స్ నుంచి ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్ కేటగిరిలోకి మార్చుతున్నట్లు ప్రకటించింది.

హార్లిక్స్‌ లేబుల్‌ తొలగింపు..కారణం ఏంటంటే?

భారత దేశంలో హార్లిక్స్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎంతగానో ఇష్టపడతారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఆహారానికి సంబంధించిన ప్రొడక్ట్స్ విషయంలో ఏమాత్రం తేడా వచ్చిన ఆ కంపెనీలపై చర్యలు తీసుకుంటుంన్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆదేశాలకు ప్రతిస్పందనగా హిందుస్థాన్ యూనిలవర్ హార్సిక్స్ లేబుల్ ను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ గా పిలిచే హార్లిక్స్ ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మారుస్తూ ప్రకటన చేసింది.

ఇటీవల ఈ-కామర్స్ ఫ్లాట్ ఫారమ్ లో వచ్చిన సూచనల మేరకు వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మార్పులు చేయాలని హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ని ఆదేశించింది. ఈ క్రమంలోనే సదరు కంపెనీ తన ప్రతిష్టాత్మక ఉత్పత్తి హార్లిక్స్ ప్రస్తుతం కేటగిరి ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ నుంచి ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్ ’ కేటగిరిలోకి మార్చుతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ చీఫ్ ఫైనాన్షియర్ ఆఫీసర్ రితేష్ తివారీ మాట్లాడతూ.. హార్లిక్స్ ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్ (ఎఫ్ఎన్‌డీ)లేబుల్ మారడం వల్ల స్పష్టమైన ప్రాతినిధ్యం ఉంటుందని ఆయన అన్నారు. 2006 లో ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం ‘హెల్త్ డ్రింక్స్’ కు కచ్చితమైన నిర్వచనం లేకపోవడం వల్ల రెగ్యూలేటరీ ఈ విషయంపై సంచలన నిర్ణయం తీసుకుందని.. కొన్ని మీడియా సంస్థల ద్వారా తెలిసింది. ఫుడ్ అండ్ సెఫ్టీ అండ్ స్టాడర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండయా ఇటీవల ఈ – కామర్స్ ఫ్లాట్ ఫామ్ లో డైరీ ఉత్పత్తులను లేబులింగ్ చేయకూడాదని తెలిపింది.

తృణధాన్యాలతో కూడిన పాల ఉత్పత్తులు, లైమ్ , ఆరెంజ్ వంటి ఫ్లేవర్లతో కూడిన ఆరోగ్య పానియాలను కేటగిరిలు వినియోగదారులకు తప్పదారి పట్టించే ఉన్నాయని పేర్కొంది. రెండు వారాల క్రితం, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ బోర్న్ విటా వంటి పానియాలను ‘హెల్త్ డ్రింక్స్’ అని లేబుల్ చేయరాదని ఈ-కామర్స్ వెబ్ సైట్ కి సూచించిన విషయం తెలిసిందే. దేశ ఆహార చ్టాల్లో ఆ వర్గానికి సరైన నిర్వచనం లేదని అధిప్రాయపడింది. కాగా, దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్యాడ్ బరీ బోర్న్ విటాలో అధిక చక్కెర కంటెంట్ ఉందని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో ద్వారా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చర్యలు తీసుకున్నారు.