iDreamPost
android-app
ios-app

EVపై 30 వేల తగ్గింపు.. క్రేజీ ఆఫర్ ఇచ్చిన హీరో మోటో కార్ప్..

ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే మీకో గుడ్ న్యూస్. హీరో మోటో కార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఏకంగా రూ. 30 వేలు తగ్గింపుతో అందిస్తోంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే మీకో గుడ్ న్యూస్. హీరో మోటో కార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఏకంగా రూ. 30 వేలు తగ్గింపుతో అందిస్తోంది.

EVపై 30 వేల తగ్గింపు.. క్రేజీ ఆఫర్ ఇచ్చిన హీరో మోటో కార్ప్..

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ హవా కొనసాగుతోంది. అందుబాటులో ఉండే ధరలు, సింగిల్ ఛార్జ్ తోనే వందకుపైగా కిలోమీటర్ల దూరం ప్రయాణించే వీలుండడంతో ఈవీ స్కూటర్లు, బైక్ లకు ప్రాధాన్యత పెరిగింది. పెట్రోల్ ధరలు పెరగడం ఖర్చులు అధికమవ్వడంతో ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొనేందుకు కస్టమర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కస్టమర్ల అభిరుచులకు తగినట్లుగా ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ సంస్థలు అద్భుతమైన ఫీచర్లు స్టన్నింగ్ లుక్స్ తో బైక్, స్కూటర్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు ఈవీలపై బంపరాఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా హీరో మోటోకార్ప్ విడా వీ1 ప్లస్‌ ఈవీపై కళ్లు చెదిరే ఆఫర్ ను ప్రకటించింది. ఏకంగా రూ. 30 వేలు డిస్కౌంట్ అందిస్తోంది.

మీరు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీరు హీరో మోటో కార్ప్ కు చెందిన విడా వీ1 ప్లస్ స్కూటర్ ను కొనుగోలు చేయొచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను అప్ డేట్ చేసిన తర్వాత హీరో మోటో కార్ప్ సరికొత్త రూపంలో రిలీజ్ చేసింది. దీంతో పాటు ధరను కూడా తగ్గించింది. అయితే అంతకు ముందు విడా వీ1 ప్రో మోడల్ ను విడుదల చేశారు. దీని ధర రూ. 1.45 లక్షలు ఉండేది. అప్ డేట్ తర్వాత విడా వీ1 ప్లస్ గా మార్కెట్ లోకి రీ లాంఛ్ చేసింది. హీరో మోటోకార్ప్ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.15 లక్షలు. కాగా విడా వీ1 ప్రోతో పోల్చితే.. విడా వీ1 ప్లస్ ధర రూ. 30 వేలు తగ్గింది.

విడా వీ1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.44 కేడబ్య్లూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. సింగిల్ ఛార్జ్ తో 143 కిలోమీటర్ల రేంజ్ ను ఇస్తోంది. 3.4సెకన్లలో గంటకు 0-40 కి.మీల వేగాన్ని అందుకుంటుంది. విడా వీ1 ప్లస్‌ గంటకు 80 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. విడా వీ1 ప్లస్ రెండూ 6కేడబ్య్లూ ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఎల్ఈడీ లైటింగ్, టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌, యాంటీ థెఫ్ట్‌ అలారం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి