iDreamPost
android-app
ios-app

తక్కువ ధరకే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. లైసెన్స్, రిజిస్ట్రేషన్ తో పని లేదు..

మీరు ఈ మధ్య ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈవీ తయారీ సంస్థ హీరో లైసెన్స్, రిజిస్ట్రేషన్ తో అవసరం లేని ఈవీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

మీరు ఈ మధ్య ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈవీ తయారీ సంస్థ హీరో లైసెన్స్, రిజిస్ట్రేషన్ తో అవసరం లేని ఈవీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

తక్కువ ధరకే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. లైసెన్స్, రిజిస్ట్రేషన్ తో పని లేదు..

ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పట్ల వాహనదారులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ ధరలు పెరగడం అదే సమయంలో ఈవీ బైక్ ల వాడకంతో ఖర్చులు తగ్గుతుండడంతో వీటి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా ఈవీ టూవీలర్ తయారీ కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో బైక్ లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్ సేల్స్ లో ఓలా దూసుకెళ్తోంది. ఏథర్, టీవీఎస్, హీరో వంటి కంపెనీలు మార్కెట్ లో తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఇప్పుడు మరో ఈవీ స్కూటర్ అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో. దాని పేరు హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్ ఎక్స్. తక్కువ ధరకే ఈ స్కూటర్ ను పొందొచ్చు.

సాధారణంగా బైక్ ను కొనుగోలు చేస్తే ఆర్టీఏ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ తప్పని సరి అదే విధంగా బైక్ ను నడపాలన్నా లైసెన్స్ తప్పని సరి. కానీ హీరో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు లైసెన్స్, రిజిస్ట్రేషన్ తో పనిలేదు. ఎందుకంటే ఇది లో స్పీడ్ ఈవీ. కాబట్టి రిజిస్ట్రేషన్ అవసరం లేదని కంపెనీ ప్రకటించింది. ఈ స్కూటర్ వేగం గంటకు 25 కి.మీల వేగంతో ప్రయాణించగలుగుతుంది. హీరో తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ అట్రియా ఎల్ ఎక్స్ స్టైలిష్ లుక్ లో అధునాతన ఫీచర్లను కలిగి ఉంది.

ఈ స్కూటర్‌లో కంపెనీ 51.2V/30Ah బ్యాటరీ ప్యాక్‌ను పొందుపరిచారు. ఈ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 85 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు. స్కూటర్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్‌ఎక్స్‌ స్కూటర్ ధర చాలా తక్కువ. ఈ స్కూటర్ ధర రూ. 77,690(ఎక్స్ షోరూం ధర). లైసెన్స్, రిజిస్ట్రేషన్ తో అవసరం లేకపోవడంతో ఈ హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్ ఎక్స్ స్కూటర్ కు కస్టమర్ల నుంచి భారీ డిమాండ్ రానున్నట్లు కంపెనీ భావిస్తోంది.