iDreamPost

Best Budget Car: బడ్జెట్ లో కారు కోసం చూస్తున్నారా? ఇది బెస్ట్ ఆప్షన్!

కారు కొనాలి అనుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక స్థోమతకి మించి మాత్రం కారుని కొనకూడదు. అందుకే మీకోసం ఒక బెస్ట్ బడ్జెట్ కారుని తీసుకొచ్చాం.

కారు కొనాలి అనుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక స్థోమతకి మించి మాత్రం కారుని కొనకూడదు. అందుకే మీకోసం ఒక బెస్ట్ బడ్జెట్ కారుని తీసుకొచ్చాం.

Best Budget Car: బడ్జెట్ లో కారు కోసం చూస్తున్నారా? ఇది బెస్ట్ ఆప్షన్!

కారు కొనాలి అని అనుకున్న తర్వాత సవాలక్ష అనుమానాలు, ప్రశ్నలు, సవాళ్లు మీకు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా మీకు వచ్చే ప్రశ్న ఎంతలో కారు కొనాలి? మీరు ఎప్పుడూ కూడా మీ ఆర్థిక స్థోమతకు మించి పెద్ద పెద్ద కార్లు కొనకండి. అది మీ ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీయడం మాత్రమే కాదు.. మీకు లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా చివరకు ఆ కారును కూడా అమ్మేసే పరిస్థితి రావచ్చు. అందుకే కారుని ఎంచుకునే సమయంలో కచ్చితంగా మీ బడ్జెట్ లో ఉందో లేదో చూసుకోవాలి. అలా మీరు బడ్జెట్ కారు కొనాలి అని చూస్తే కచ్చితంగా మారుతీ వేగన్ ఆర్ కారు బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

మారుతీ కంపెనీ నుంచి ఎన్నో మంచి బడ్జెట్ కార్లు ఉన్నాయి. ఇప్పుడు 2023 తర్వాత బీఎస్ 6 ఇంజిన్ తో చాలా మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. వాటిలో మారుతీ వేగన్ ఆర్ కూడా ఒకటి. ఈ కారు బడ్జెట్ రేంజ్ లోనే ఉండటం కాకుండా.. మంచి ఫీచర్స్ కూడా కలిగి ఉంది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఒక నగరంలో ఉండే ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలకు వేగన్ ఆర్ కారు అనేది బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఈ హ్యాచ్ బ్యాక్ కొనుగోలు చేస్తే మీరు ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా ఎంతో సులభంగా ప్రయాణం చేయచ్చు. అంతేకాకుండా తక్కువ పార్కింగ్ స్పేస్ లో కూడా కంఫర్టబుల్ గా పార్క్ చేసుకోవచ్చు.

ఇంక ఈ కారు ధర చూస్తే.. రూ.5.5 లక్షల ఎక్స్ షోరూమ్ ధర నుంచి ఈ కారు మోడల్ స్టార్ట్ అవుతుంది. మీకు రూ.8.3 లక్షల ఎక్స్ షోరూమ్ ధరకు హైఎండ్ మోడల్ లభిస్తుంది. వేగన్ ఆర్ కారు మొత్తం 12 వేరియంట్స్ ఉన్నాయి. వేరియంట్ మారే కొద్దీ స్పెసిఫికేషన్స్ మారడమే కాకుండా.. ధర కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ కారులో ఇంకో బెస్ట్ ఏంటంటే.. మీకు నచ్చిన ఇంజిన్ మీరు సెలక్ట్ చేసుకోవచ్చు. 998సీసీ 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1197 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే పెట్రోల్, సీఎన్జీ ఫ్యూయల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంక మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

మైలేజ్ విషయానికి వస్తే.. పెట్రోల్ మాన్యువల్, ఆటోమేటిక్ వర్షన్స్ లో లీటరుకు 24 నుంచి 25 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. ఇంక సీఎన్జీ మోడల్ లో కిలోకి 34 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. ఇంక ఈ హ్యాచ్ బ్యాక్ ని ఎందుకు సెలక్ట్ చేసుకోవాలి అంటే ట్రాఫిక్ సమస్యను అధిగమించడం మాత్రమే కాకుండా.. ఇంటీరియర్ లో కూడా వేగన్ ఆర్ కు మంచి మార్కులు పడతాయి. అంతేకాకుండా సిటీలోనే కాకుండా.. హైవేలో ప్రయాణం చేసే సమయంలో కూడా 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ కావడంతో మంచి స్పీడ్, పికప్ కూడా లభిస్తుంది. ఇంకా 341 లీటర్స్ బూట్ స్పేస్ కూడా లభిస్తోంది. అయితే ఈ కారులో సేఫ్టీ పరంగానే కొన్ని మార్పులు చేస్తే బాగుంటుంది. ఇది ఫ్రంట్ డ్యూయల్ బ్యాగ్ తో వస్తోంది. కానీ, గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్ లో మాత్రం కేవలం 1 స్టార్ మాత్రమే లభించింది. మరి.. ఈ వేగన్ ఆర్ కారుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి