iDreamPost
android-app
ios-app

సొంతిల్లు కావాలనుకునే వారికి గుడ్ న్యూస్.. త్వరలో కొత్త హోమ్ లోన్ స్కీమ్స్!

మీరు సొంతింటి కల నెరవేర్చుకునేందుకు గృహరుణాల కోసం ఎదురుచూస్తున్నారా? ఇలాంటి వారికి గుడ్ న్యూస్. త్వరలోనే కొత్త హోమ్ లోన్ స్కీమ్స్ అందుబాటులోకి రాబోతున్నాయి.

మీరు సొంతింటి కల నెరవేర్చుకునేందుకు గృహరుణాల కోసం ఎదురుచూస్తున్నారా? ఇలాంటి వారికి గుడ్ న్యూస్. త్వరలోనే కొత్త హోమ్ లోన్ స్కీమ్స్ అందుబాటులోకి రాబోతున్నాయి.

సొంతిల్లు కావాలనుకునే వారికి గుడ్ న్యూస్.. త్వరలో కొత్త హోమ్ లోన్ స్కీమ్స్!

సొంతిల్లు కావాలని ప్రతిఒక్కరు కలలుకంటుంటారు. ఇందుకోసం నిరంతరం శ్రమించి పైసాపైసా కూడబెడుతుంటారు. అయితే వారు సంపాదించిన సొమ్ము ఇంటి నిర్మాణానికి సరిపోకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో బ్యాంకుల్లో లోన్ తీసుకునేందుకు సిద్ధమైపోతుంటారు. బ్యాంకులు ఆ వ్యక్తి సిబిల్ స్కోర్, ఇతర వివరాలను పరిశీలించి లోన్ కావాలనుకునే వారికి మంజూరు చేస్తుంటాయి. ఈ క్రమంలో గృహ రుణాల కోసం ఎదురుచూసే వారికి భారీ శుభవార్త. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లోన్ల పై కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే రెండు కొత్త లోన్ పథకాలను ప్రవేశపెట్టబోతోంది.

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు కొత్త హోమ్ లోన్స్ అందించేందుకు రెడీ అవుతోంది. హోమ్ సేవర్ ప్రొడక్ట్, హోమ్ రిఫర్బిష్ మెంట్ అనే రెండు కొత్త లోన్ సదుపాయాలను త్వరలోనే ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు బ్యాంక్ సీనియర్ అధికారి తెలిపారు. వచ్చే ఏప్రిల్ నెలలో హోమ్ సేవర్ ప్రొడక్ట్, ఆ తర్వాత హోమ్ రిఫర్బిష్ మెంట్ లోన్ ను హెచ్డీఎఫ్సీ అందిచనుంది. ఈ రెండు కొత్త లోన్ స్కీమ్స్ ను ఇదివరకే ఉన్న కస్టమర్లతో పాటు కొత్త కస్టమర్లకు కూడా అందించనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్టగేజ్‌ బ్యాంకింగ్, హోమ్ లోన్, ల్యాప్ కంట్రీ హెడ్ అరవింద్ కపిల్ మీడియాకు వెల్లడించారు.

సాధారణ బ్యాంక్ హోమ్ లోన్స్ పై వసూల్ చేసే వడ్డీ రేటు కంటే హోమ్ రిఫర్బిష్ మెంట్ లోన్ 100 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అరవింద్ కపిల్ తెలిపారు. కాగా హోమ్ సేవర్ ప్రొడక్ట్‌ అనేది ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం వంటిది. దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ అందిస్తున్న మ్యాక్స్‌గెయిన్ హోమ్ లోన్ స్కీమ్‌కి పోటీగా దీన్ని భావించవచ్చని బ్యాంక్ అధికారులు వెల్లడిస్తున్నారు. హోమ్‌ రీఫర్బిష్‌మెంట్‌ లోన్‌ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో విలీనానికి ముందు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌ ఈ లోన్‌ను అందించేది. ఇప్పుడు ఈ లోన్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చేందుకు హెచ్డీఎఫ్సీ నిర్ణయించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుతం ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటుతో లింక్‌ అయిన గృహ రుణాలపై 8.55 నుంచి 9.10 శాతం వడ్డీ వసూల్ చేస్తుంది.