HDFC కస్టమర్లకు అలర్ట్.. నిలిచిపోనున్నయూపీఐ సేవలు! ఎందుకంటే..

HDFC UPI services: ప్రైవేటు బ్యాంకుల్లో అతిముఖ్యమైన వాటిల్లో హెచ్ డీఎఫ్సీ ఒకటి. ఇది తన కస్టమర్ల కోసం అనేక సేవలను, సౌకర్యాలను అందిస్తుంది. వివిధ రకాల డిపాజిట్లు, ఇతర అనేక విషయాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలను కస్టమర్లకు తెలియజేస్తుంది.

HDFC UPI services: ప్రైవేటు బ్యాంకుల్లో అతిముఖ్యమైన వాటిల్లో హెచ్ డీఎఫ్సీ ఒకటి. ఇది తన కస్టమర్ల కోసం అనేక సేవలను, సౌకర్యాలను అందిస్తుంది. వివిధ రకాల డిపాజిట్లు, ఇతర అనేక విషయాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలను కస్టమర్లకు తెలియజేస్తుంది.

నేటికాలంలో ప్రతి ఒక్కరికి బ్యాంకులతో పనులు ఉంటాయి. అందుకే బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తిగా చూస్తుంటారు. ఇదే సమయంలో అనేక ప్రైవేటు బ్యాంకులు.. తమ సంస్థలోని వడ్డీరేట్లకు సంబంధించి, ఇతర సేవలకు సంబంధించి తమ వినియోగదారులకు కీలక సమాచారం అందిస్తుంటాయి. తాజాగా ప్రముఖ ప్రైవేటు బ్యాంకు అయినా హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కస్టమర్లకు కూడా ఓ  అలెర్ట్ వచ్చింది. త్వరలో ఈ బ్యాంకుకి సంబంధించిన యూపీఐ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. మరి.. యూపీఐ సేవలు నిలిచిపోవడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రైవేటు బ్యాంకుల్లో అతిముఖ్యమైన వాటిల్లో హెచ్ డీఎఫ్ సి ఒకటి. ఇది తన కస్టమర్ల కోసం అనేక సేవలను, సౌకర్యాలను అందిస్తుంది. రుణాలు, ఫిక్స్ డిపాజిట్లు వంటి ఇతర అనేక విషయాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలను కస్టమర్లకు తెలియజేస్తుంది. అంతేకాక వినియోగదారులను పెంచుకునేందుకు అనేక సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తుంది. ఏదైనా టెక్నికల్ ఇష్యూ జరిగితే.. తన కస్టమర్లను అలెర్ట్ చేస్తుంది. ఈక్రమంలోనే హెచ్ డీఎఫ్ సీ కస్టమర్లకు కీలక అలెర్ట్ వచ్చింది. ఆ బ్యాంకుకు సంబంధించిన యూపీఐ సేవలు తాత్కాలికంగా ఆగిపోనున్నాయి.

ఈనెల 13న పలు గంటల వ్యవధిలో రెండుసార్లు యూపీఐ ట్రాన్సాక్షన్స్​ పని చేయవు. ఈ విషయం దిగ్గజ బ్యాంకింగ్​ సంస్థ హెచ్ డీఎఫ్ సీ వెల్లడించింది. ఈ విషయంపై హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కీలక విషయాలను తెలిపింది. జులై 13న షెడ్యూల్డ్​ సిస్టెమ్​ అప్​గ్రేడ్​ చేస్తున్నట్టు ప్రకటించింది​. ఫలితంగా యూపీఐ సేవలపై తాత్కాలికంగా ప్రభావం పడనుందని సదరు బ్యాంకు స్పష్టం చేసింది. జులై 13 తెల్లవారుజామున 3 గంటల నుంచి 3 గంటల 45 నిమిషాల వరకు యూపీఐ సర్వీస్ పని చేయదు. అలానే తిరిగి 9.30 గంటల నుంచి 12.45 నిమిషాల వరకు యూపీఐ సర్వీస్​ పనిచేయదని బ్యాంకు పేర్కొంది.

తాము తెలిపిన సమయాల్లో నెట్​బ్యాంకింగ్​, మొబైల్​ బ్యాంకింగ్​ సేవలు పనిచేయవని హచ్ డీఎఫ్ సీ స్పష్టం చేసింది. అంతేకాక ఎంపీఎస్​, నెఫ్ట్​, ఆర్​టీజీఎస్​, అకౌంట్​ టు అకౌంట్​ ట్రాన్స్​ఫర్​, బ్రాంచ్​ ట్రాన్స్​ఫర్​ వంటి నగదు లావాదేవీలకు ఉన్న అన్ని మార్గాలు ఈ అప్​గ్రేడ్ చేసే సమయంలో అందుబాటులో ఉండవని హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు వినియోగదారులు గుర్తుంచుకోవాలి. ఈ నేపథ్యంలో అసౌకర్యానికి గురి కాకుండా యూపీఐ నగదు లావాదేవీలకు సంబంధించి వినియోగదారులు ముందుగానే ప్లాన్​ చేసుకోవాలని హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ సూచించింది. గతంలో కూడా ఇలా పలు బ్యాంకులు కొంత సమయం పాటు యూపీఐ సేవలను నిలిపి వేసింది. సిస్టమ్ అప్ గ్రేట్ చేసే సమయంలో ఇలా జరగుతుండటం సర్వసాధారణం. అయితే కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా.. బ్యాంకులు అలెర్ట్ చేస్తుంటాయి.

Show comments