iDreamPost
android-app
ios-app

4 రోజుల్లో లక్ష కోట్లు నష్టపోయిన HDFC బ్యాంకు!

4 రోజుల్లో లక్ష కోట్లు నష్టపోయిన HDFC బ్యాంకు!

దేశ దిగ్గజ ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు భారీ నష్టాన్ని చవిచూసింది. 4 రోజుల్లో ఏకంగా లక్ష కోట్ల రూపాయలు నష్టపోయింది. బ్యాంకు షేర్లు.. నాలుగు ట్రేడింగ్‌ రోజుల్లో 6 శాతానికి క్షీణించాయి. దీంతో బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ లక్ష కోట్లు క్షీణించింది. బీఎస్‌ఈ వివరాల మేరకు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్‌ క్యాప్‌ 11.59 లక్షల కోట్లుగా ఉంది. శుక్రవారం ఈ బ్యాంకు షేర్లు 1557 వద్ద ప్రారంభం అయ్యాయి. 2.11 క్షీణించి.. 1524 వద్ద కనిష్ట స్థాయికి పడిపోయాయి. వరుసగా నాలుగు రోజుల పాటు ఈ క్షీణత కొనసాగింది. ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.

ఇన్వెస్టర్ల సెంటిమెంట్లు ప్రభావితం కావడానికి విదేశీ నిధుల ప్రవాహం, హచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లలో భారీ అమ్మకాలు కూడా ఓ కారణమే. నిఫ్టీ వారంలో 2.6 శాతం పడిపోగా.. సెన్సెక్స్‌ 2.7 శాతం క్షీణించింది. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ సెప్టెంబర్‌ 22తో ముగిసే సమయానికి 1.7 శాతం క్షీణించింది. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 2 శాతం క్షీణించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అమ్మకాల ఒత్తిడి కారణంగా ఈ నమూనా ఎక్కువగా కనిపించింది. ఇండెక్స్‌కు సంబంధించి 20 రోజుల చలన సగటు 45వేలను అధిగమించింది. మరి, నాలుగు రోజుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లక్ష కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.