iDreamPost
android-app
ios-app

మీకు 21 ఏళ్లు  వచ్చాయా? HDFC బ్యాంక్ గుడ్ న్యూస్!

HDFC: దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక రకాల సౌకర్యాలను తన కస్టమర్లకు అందిస్తుంది. తాజాగా కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది.

HDFC: దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక రకాల సౌకర్యాలను తన కస్టమర్లకు అందిస్తుంది. తాజాగా కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది.

మీకు 21 ఏళ్లు  వచ్చాయా? HDFC బ్యాంక్ గుడ్ న్యూస్!

ప్రజలకు బ్యాంకులు అనేక సేవలు అందిస్తుంటాయి. వివిధ రకాల స్కీమ్స్ అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటాయి. తమ సేవలను పెంచుకుంటూ పోతూ..కస్టమర్లకు కొత్త సౌకర్యాలను అందిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు బ్యాంకులు తమ సేవలను విస్తరిస్తున్నాయి. అనేక రకాల సౌకర్యాలను తమ వినియోగదారులకు అందిస్తున్నాయి. అలానే ప్రైవేటు రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. అయితే ఇది 21 ఏళ్లు  దాటిన వారికి మాత్రమే అవకాశం. మరి.. హెచ్ డీఎఫ్సీ బ్యాంకు అందిస్తున్న ఆ గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం..

దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక రకాల సౌకర్యాలను తన కస్టమర్లకు అందిస్తుంది. అలానే వడ్డీ రేట్ల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంటుంది. తన కస్టమర్లకు, సామాన్య ప్రజలకు తరచూ ఏదో ఒక శుభవార్త అందిస్తోంది. తాజాగా కూడా మరో అదిరే గుడ్ న్యూస్ అందించింది. కొత్త క్రెడిట్ కార్డును మార్కెట్‌లోకి తెచ్చింది.

ఈ క్రెడిట్ కార్డు అనేది మ్యానువల్ కార్డు కాదు. ఇది వర్చువల్ క్రెడిట్ కార్డు. మీరు దీన్ని ఆన్ లోనే ఉపయోగించుకోవచ్చు. ఈ కార్డుకు ఫిజికల్ కార్డును పొందలేం. అలానే ఈ కార్డు ద్వారా అనేక రకాల లాభాలను పొందొచ్చు.ఇంకా ఈ కార్డులో జాయిన్ అయ్యేందుకు లేదా పొందేందుకు ఉండే జాయినింగ్ ఫీజు తక్కువగానే ఉంది. ఈ కార్డు విషయంలో సింపుల్ గా చెప్పాలంటే..హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిజిటల్ క్రెడిట్ కార్డుగా దీనిని భావించవచ్చు. ఈ డిజిటల్ కార్డును పిక్సెల్ ప్లే క్రెడిట్ కార్డుగా పిలుస్తారు. ఈ కార్డు ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందొచ్చు. మీకు నచ్చిన కార్డు డిజైన్, బిల్లింగ్ వంటి సర్వీసులు పొందొచ్చు.

పేజాప్ ద్వారా ఈ డిజిటల్ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది పొందాలంటే కొన్నిఅర్హతలు ఉండాల్సి ఉంటుంది. అలానే ఈ కార్డు అనేది అప్పటికప్పుడు పొందవచ్చు. మీరు రివార్డ్‌లు ఈ కార్డులో యాక్సెస్ చేయవచ్చు. ఎటువంటి హార్ట్ కాఫీలు లేకుండానే డిజిటల్ రూపంలో కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.

మీరు ఈ కార్డు పొందాలని భావిస్తే.. మీ ఫోన్‌లో పేజాప్ యాప్ ఉండాలి. ఉంటే ఓకే. లేదంటే ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డు ద్వారా బుక్ మై షో, జొమాటో, ఉబెర్, , రిలయన్స్ స్మార్ట్ బజార్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, మింత్రా వంటి వాటిలో 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్ లైన్ వాటిల్లో షాపింగ్ చేస్తే 3 శాతం తగ్గింపు వస్తుంది. అన్ని ఇతర ఖర్చులపై 1 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ ఉంటుంది.

ఎవరైనా రూ. 500తో కార్డును పొందొచ్చు. కార్డు వచ్చిన  మూడు నెలల లోపు రూ. 20 వేలు ఖర్చు చేయాలి. అలా చేస్తే మీరు మెంబర్‌షిప్ ధర మాఫీ అవుతోంది. అలానే  ఎవరైనా సరే గతేదాడిలో రూ. 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే, వచ్చే ఏడాది రెన్యూవల్ సభ్యత్వంలో ఛార్జీ మినహాయిస్తారు. ఇక ఈ కార్డు పొందడానికి 21 నుంచి 61 ఏళ్లు ఉన్న వారు ఈ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. నెలవారీ ఆదాయం కనీసం రూ. 25,000 ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు.. కార్డు కోసం అప్లయ్ చేసి.. హెడ్ డీఎఫ్ సీ అందించే బెనిఫిట్స్ ను పొందొచ్చు.