Vinay Kola
Property: ఆస్తులు కబ్జా అవ్వడం కామన్ అయిపోయింది. ఇది ఎప్పటినుంచో జరుగుతుంది.
Property: ఆస్తులు కబ్జా అవ్వడం కామన్ అయిపోయింది. ఇది ఎప్పటినుంచో జరుగుతుంది.
Vinay Kola
చాలా మందికి కూడా ఆస్తులు ఉంటాయి కానీ, వాటిని కాపాడుకోవడం తెలీదు. ముఖ్యంగా చదువు లేని వాళ్ళకు ఆస్తులకు సంబంధించి చాలా విషయాలు తెలీవు. అవి తెలీక తమ ఆస్తులను పోగొట్టుకుంటారు. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పే విషయం నగారాల్లో నివసించే ప్రజలకు తెలుసు కానీ పల్లె టూర్లలో నివసించే చాలా మందికి కూడా తెలికపోవచ్చు. ఈ విషయం తెలీకపోతే కచ్చితంగా నష్టపోవడం పక్కా. ఇంతకీ ఆ విషయం ఏంటి? దాని గురించి తెలుసుకోకపోతే కలిగే నష్టాలు ఏంటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? పూర్తి వివరాలు మనం ఇప్పుడు డీటైల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మన ఆస్తులను కాపాడుకోవాలంటే కచ్చితంగా సేఫ్ డాక్యుమెంటేషన్ అనేది చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇలాంటి ప్రూఫ్ లేదు. అందువల్ల చాలా మంది ఆస్తులు కోల్పోయే వారు. అందుకే మన ఆస్తులను నిర్ధారించడానికి ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈమధ్య కాలంలో ఆస్తి మోసం మరియు నకిలీ పత్రాలతో కూడిన బ్లాక్‌మెయిల్ సంఘటనలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అందుకే ఆస్తి యజమానులను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.రెవెన్యూ శాఖ, తాలూకా కార్యాలయాల ద్వారా ఆస్తుల రికార్డులను డిజిటైజేషన్ చేసేందుకు ప్రభుత్వ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ డిజిటైజేషన్ అనేది ప్రాపర్టీ డాక్యుమెంట్ యాక్సెస్‌ను ఈజీ చేస్తుంది. దీని వల్ల మీ ఆస్తికి మీరే యజమాని అని చాలా ఈజీగా ప్రూవ్ చేయవచ్చు. పైగా దీని వల్ల ఎవరు కూడా మీ సంతకాలను ఫోర్జరీ చేయలేరు.
డిజిటైజేషన్ అంటే ఆస్తి యజమానులు తమ ఆస్తి డాక్యుమెంట్లను గవర్నమెంట్ పోర్టల్‌లకు అప్‌లోడ్ చేయాలి. ఈ విధంగా డిజిటల్ రికార్డులను కలిగి ఉండటం వలన ఆస్తి యజమానులు ఆస్తి సంబంధిత డాక్యుమెంటేషన్ కోసం ఎటువంటి కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మోసాలు జరగకుండా కచ్చితంగా ఆస్తి పత్రాలకు ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి. ఈ లింకేజీ ఆస్తికి నిజమైన యాజమనులను వెరిఫై చేయడంలో సహ్యపడుతుంది. ఇది అనధికార అమ్మకాలను కూడా తగ్గిస్తుంది. డిజిటైజేషన్ వల్ల మోసగాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కష్టం అవుతుంది. ఈ డిజిటైజేషన్ ప్రాసెస్ జనవరి నెలలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఆస్తి యజమానులు ఆస్తి పత్రాలను సేకరించి, ఆధార్ లింకేజీని వెరిఫై చేసుకొని రెఢీ గా ఉండండి. మీ ఆస్తిని కాపాడుకోండి.ఇదీ సంగతి. ఇక ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.