iDreamPost

యూజర్లకు అలర్ట్.. అక్కడ జూన్ 4 నుంచి GPay సేవలు బంద్!

గూగుల్ పే యూజర్లకు బిగ్ అలర్ట్. జూన్ 4 నుంచి అక్కడ గూగుల్ పే సేవలు బంద్ కానున్నాయి. అక్కడి వారు ఇక గూగుల్ పే సేవలు పొందలేరు. ఇంతకీ ఎక్కడంటే?

గూగుల్ పే యూజర్లకు బిగ్ అలర్ట్. జూన్ 4 నుంచి అక్కడ గూగుల్ పే సేవలు బంద్ కానున్నాయి. అక్కడి వారు ఇక గూగుల్ పే సేవలు పొందలేరు. ఇంతకీ ఎక్కడంటే?

యూజర్లకు అలర్ట్.. అక్కడ జూన్ 4 నుంచి GPay సేవలు బంద్!

డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల ప్రక్రియ సులభమైపోయింది. చేతిలో నగదు లేకున్న పర్లేదు.. కావాల్సిన వస్తువులు తీసుకుని ఆన్ లైన్ చెల్లింపులు చేసుకునే సౌకర్యం కలిగింది. దాదాపుగా ట్రాన్సాక్షన్స్ కోసం బ్యాంకులకు వెళ్లే అవసరమే లేకుండా పోయింది. కిరాణ కొట్టు దగ్గర్నుంచి షాపింగ్ మాల్స్, హోటల్స్ వంటి వాటిల్లో డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ కు వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది యూజర్స్ ఉన్నారు. అయితే గూగుల్ పే వాడే యూజర్లకు బిగ్ షాక్. అక్కడ జూన్ 4 నుంచి గూగుల్ పే సేవలు బంద్ కానున్నాయి. ఇంతకీ ఎక్కడ? ఏ కారణం చేత గూగుల్ పే సేవలు బంద్ కాబోతున్నాయి? ఆ వివరాలు మీకోసం.

దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరి ఫోన్ లో గూగుల్ పే యాప్ ఉంటుందనే చెప్పాలి. గూగుల్ పే వినియోగించే యూజర్లకు బిగ్ అలర్ట్. అక్కడ గూగుల్ పే జూన్ 4 నుంచి పనిచేయదు. ఈ విషయాన్ని గూగుల్ కూడా ధ్రువీకరించింది. అయితే గూగుల్ పే సేవలు బంద్ కానున్నది భారత్ లో మాత్రం కాదు. అమెరికాలో గూగుల్ పే సేవలు బంద్ కానున్నాయి. జూన్ 4 నుంచి గూగుల్ పే సేవలు అమెరికాలో అందుబాటులో ఉండవు. భారత్‌లో యథావిధిగా గూగుల్ పే సేవలు కంటిన్యూ అవుతాయి. యూఎస్ లో గూగుల్ పే సేవలు బంద్ కావడానికి గల కారణం ఏంటంటే..

Gpay

గూగుల్ పే సర్వీసులు గూగుల్ వ్యాలెట్‌కు బదిలీ అయిపోతాయి. జూన్ 4 తర్వాత అమెరికాలోని యూజర్లు గూగుల్ పే సర్వీసులను వాడలేరు. ఇప్పటికే గూగుల్ వ్యాలెట్ యూఎస్ లో అందుబాటులో ఉంది. దీన్ని ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూజర్లు తమ కార్డులు, పాస్‌లు, టిక్కెట్లు, కీలు, ఐడీలను సురక్షితంగా స్టోర్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వీటిల్లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, టికెట్స్, పాస్‌లు, ఇతర ఐడీ కార్డులు, గిఫ్ట్ కార్డులు వంటి వాటిని సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి