iDreamPost
android-app
ios-app

పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. ఆ డబ్బులు ఖాతాలోకి వస్తున్నాయి

  • Published Mar 06, 2024 | 6:49 PM Updated Updated Mar 06, 2024 | 10:09 PM

దేశంలో పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఓ గుడ్ న్యూస్ ను తెలిపింది. త్వరలోనే పెండింగ్ రిఫండ్స్ కోసం ఎదురుచూసే వారికి ఇది ఒక చక్కటి ఆవకాశం అని చెప్పవచ్చు.

దేశంలో పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఓ గుడ్ న్యూస్ ను తెలిపింది. త్వరలోనే పెండింగ్ రిఫండ్స్ కోసం ఎదురుచూసే వారికి ఇది ఒక చక్కటి ఆవకాశం అని చెప్పవచ్చు.

  • Published Mar 06, 2024 | 6:49 PMUpdated Mar 06, 2024 | 10:09 PM
పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. ఆ డబ్బులు ఖాతాలోకి వస్తున్నాయి

ఇన్ కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం దేశంలో చాలామంది ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇతర రంగాలకు చెందిన వారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇలా దేశంలో చాలామంది పన్ను చెల్లింపుదారులు ఉంటారు. మరి అలా పన్ను చెల్లించిన వారందరూ ఎప్పటి నుంచో పెండింగ్ రిఫండ్స్ కోసం ఎదురుచూస్తు ఉన్నారు. అలాంటి వారందరికి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఓ చక్కటి శుభవార్తను అందించింది. త్వరలోనే పెండింగ రిటర్న్స్ ప్రాసెసింగ్ పూర్తి చేసి రిఫండ్స్ రిలీజ్ చేస్తామని వెల్లడించింది. అందుకు డెడ్‌లైన్ కూడా ఫిక్స్ చేసింది. ఇక అర్హులైన వారికి ఇ-మెయిల్స్ పంపిస్తోంది. మరి ఎన్నోరోజులుగా వేచి చూస్తున్నపన్ను చెల్లింపుదారులకు ఇది ఒక మంచి ఆవకాశం. ఇంతకి దీని చివరి గడువు ఎప్పుడంటే..

దేశంలో పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఓ గుడ్ న్యూస్ ను తెలిపింది. ఆర్థిక ఏడాది 2020-21 (అసెస్మెంట్ ఇయర్ 2021-22)కు సంబంధించిన ఆదాయపు పన్ను రిఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఇక తీపికబురు అని చెప్పవచ్చు. ఈ మేరకు ఈ ఆదేశాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) మార్చి 1, 2024 రోజునే జారీ చేసింది. అలాగే పెండింగ్ రిఫండ్స్ కోసం చూస్తున్న ట్యాక్స్ పేయర్స్ కి ఆదాయపు ట్యాక్స్ రిఫండ్ అనేది ఏప్రిల్ 30, 2024 నాటికి అందజేయనున్నట్లు వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు ఎవరైతే చాలా రోజులుగా ఆయా పెండింగ్ రిఫండ్ కోసం చూస్తున్నారో వారికి ఐటీశాఖ నుంచి మెయిల్స్ వస్తాయి.

అలాగే వారు తమ పెండింగ్ రిఫండ్స్ కు సంబంధించి స్టేటస్ తెలుసుకునేందుకు ఇమెయిల్స్ చెక్ చేసుకోవచ్చని తెలిపింది.దీంతోపాటు ఏదైనా రిఫండ్ చెల్లించే అవకాశం ఉన్న వారికి సమాచార నోటీసులు పంపించే అవకాశం ఉందని, ఎప్పటికప్పుడు ఇ-మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలని తెలిపింది. ఇక సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC) ఐటీఆర్స్ ని నిర్ణీత సమయంలోపూ ప్రాసింగ్ చేసిన తర్వాత వాటికి సంబంధించి ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 143(1) ప్రకారం ట్యాక్స్ పేయర్స్‌కి సమాచార నోటీసులు జారీ చేస్తారు. మరి ఇలాంటి సమాచార నోటీసులు అందినట్లయితే వారి ఐటీఆర్ సక్సెస్ ఫుల్ గా ప్రాసెసింగ్ పూర్తయిందని అర్థం. దీంతో ఏదైనా రిఫండ్ అమౌంట్ రావాల్సి ఉంటే అది బ్యాంక్ ఖాతాలో తక్షణమే జమ అవుతుంది.

కాగా, చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఆర్థిక ఏడాది 2020-21కి సంబంధించిన ఐటీ రిటర్న్స్ ప్రాసెసింగ్ కోసం వేచి చూస్తున్న వారికి ఐటీఆర్ ప్రాసెసింగ్ లో జాప్యం జరిగడంతో ఇప్పడు వాటికి మోక్షం లభించింది. అయితే, సాంకేతిక సమస్యలు, ఇతర కారణాల వల్ల అసెస్మెంట్ ఇయర్ 2021-22కి సంబంధించిన కొన్ని ఐటీ రిటర్న్స్ ని ప్రాసెసింగ్ చేయలేదని గతంలోనే ఐటీ శాఖ తెలిపింది. కాగా, సెక్షన్ 143 (1)లోని సబ్ సెక్షన్ (1) ప్రకారం వాటి ప్రాసెసింగ్ నిలిపివేసినట్లు తెలిపింది. దీని కారణంగా సరైన సమయానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి సైతం రిఫండ్స్ అందలేదు. కానీ, ఇప్పుడు వాటి ప్రాసెసింగ్ కి సంబంధించి ఐటీ శాఖ డెడ్‌లైన్ ఫిక్స్ చేసింది. ఈ క్రమంలోనే పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగిస్తూ ఐటీ రిటర్న్స్ ప్రాసెసింగ్ సమయాన్ని ఏప్రిల్ 30, 2024కు పెంచింది.