iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గుతున్న బంగారం ధరలు!

బంగారం కొనాలనుకునే వారికి మళ్లీ శుభవార్త. కిందటి రోజు పెరిగిన బంగారం ధర మళ్లీ ఇవాళ తగ్గింది. గత వారం రోజులుగా బంగారం ధర భారీగా పడిపోయింది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

బంగారం కొనాలనుకునే వారికి మళ్లీ శుభవార్త. కిందటి రోజు పెరిగిన బంగారం ధర మళ్లీ ఇవాళ తగ్గింది. గత వారం రోజులుగా బంగారం ధర భారీగా పడిపోయింది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గుతున్న బంగారం ధరలు!

ప్రతి ఒక్కరికి బంగారం అంటే  ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఆడవాళ్లు పసిడి అంటే పడి చచ్చిపోతారు. ఆర్థికంగా కాస్తా గట్టిగా ఉన్న ప్రతి సారి బంగారం కొన్నేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలానే మధ్యతరగతి వారు సైతం ఉన్న డబ్బులతో పసిడిని కొంటుంటారు. అందుకే రోజూ గోల్డ్ రేట్లకు సంబంధించిన సమాచారం కోసం ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల కొంతకాలం నుంచి బంగారం ధర భారీగా పెరుగుతూ వెళ్లింది. ఇంకా చెప్పాలంటే గోల్డ్ హిస్టరీలోనే రికార్డు స్థాయిలో ధరలు వెళ్లాయి. దీంతో బంగారం కొన్నేందుకు పిసిడి ప్రియులు సైతం వెనుకడు వేశారు. ఈ క్రమంలోనే పిసిడి ప్రియులకు, ముఖ్యంగా మహిళలకు శుభవార్త వచ్చింది. కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు కాస్తా తగ్గుతున్నాయి. అలానే రానున్న రోజుల్లో బంగారం ధర భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

అంతర్జాతీయ మార్కెట్ల్ లో జరిగే మార్పుల ప్రకారం.. గోల్డ్, సిల్వర్ రేట్లలో మార్పులు వస్తాయి. ఈ నేపథ్యంలోనే రోజూ వీటి ధరల్లో స్వల్ప, భారీ మార్పులు చోటుచేసుకుంటాయి. గత నెల రోజుల్లో భారీగా పెరిగి రికార్డులు క్రియేట్ చేసిన బంగారం ధరలు పసిడి ప్రియులను షాకి గురి చేశాయి. ఈ నేపథ్యంలోనే బంగారం ప్రియులకు,ముఖ్యంగా మహిళలకు ఓ శుభవార్త.  కొంతకాలం నుంచి పెరిగిన బంగారం,సిల్వర్ ధరలు ఇప్పుడు భారీగా తగ్గుతున్నాయి.  దీంతో బంగారం కొనాలనుకునేవారికి కాస్త ఊరట లభించినట్లేనని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ప్రస్తుతం బంగారం ధర తగ్గుతూ వస్తునప్పటికీ ఇంకా రేటు భారీగానే ఉంది. గత నెల రోజుల్లో వరుసగా రోజుకు రూ. 1000 వరకు పెరుగుతూ వెళ్లింది. పెరగడం భారీగా ఉండి, తగ్గుదల మాత్రం చాలా స్వల్పంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మునపటి స్థాయికి బంగారం ధరలు రావడానికి కాస్త టైమ్ పడుతుంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితు కారణంగానే బంగారం ధర పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై ప్రకటనలు కూడా బంగారం ధరల కారణం అవుతున్నాయని చెబుతున్నారు.

ప్రస్తుతం  అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ధర ఔన్సుకు వచ్చేసి 2330 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అలానే స్పాట్ వెండీ ధర 27.38 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక డాలర్ తో పోలిస్తే ఇండియ కరెన్సీ అయిన రూపాయి మారకం విలువ రూ. 83.30 ఉంది.  ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కనిపిస్తున్నా.  దేశీయంగా నేడు బంగారం, వెండి రేట్లు కాస్తా తగ్గాయనే చెప్పొచ్చు. వివిధ నగరాల్లో వేరు వేరు ధరలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 350 పడిపోయింది. ప్రస్తుతం తులం బంగారం రూ. 66,250 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 380 తగ్గింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ రూ. 72,270 వద్ద కొనసాగుతోంది. ముందు రోజు కూడా వరుసగా 22, 24 క్యారెట్స్ బంగారం 450, రూ. 490 పెరిగింది. అంతకుముందు ఒక రోజులో రూ.1400, రూ. 1530 వరకు పతమైనంది. మొత్తంగా రానున్న రోజుల్లో మరింత  తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.