P Krishna
Gold Silver Rate: దేశంలో ఆషాఢ మాసం మొదలైంది.. పండగలు, శుభకార్యాల సందడితో గ్రామాలు, పట్టణాలు కలకలలాడుతుంటాయి. ఈ సమయాల్లో మహిళలు ఎక్కువగా పసిడి కొనుగోలు చేస్తుంటారు.
Gold Silver Rate: దేశంలో ఆషాఢ మాసం మొదలైంది.. పండగలు, శుభకార్యాల సందడితో గ్రామాలు, పట్టణాలు కలకలలాడుతుంటాయి. ఈ సమయాల్లో మహిళలు ఎక్కువగా పసిడి కొనుగోలు చేస్తుంటారు.
P Krishna
గత కొంత కాలంగా దేశంలో పసిడి, వెండి ధరలు తరుచూ తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. దీనికి గల ముఖ్య కారణం అంతర్జాతీయ మార్కెట్ జరుగుతున్న కీలక పరిణామాలు, యుద్దాల ప్రభావం అంటున్నారు ఆర్థిక నిపుణులు. మార్కెట్ లో బంగారం, వెండి ధరలు తగ్గినపుడు కొనుగోలు చేస్తే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే భవిష్యత్ లో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.. మహిళలు ఎక్కువగా జ్యులరీ షాపులకు కడుతుంటారు. పసిడి కొనుగోలు చేయానుకునే వారు ఎప్పటికప్పడు మార్కెట్ లో ధరల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే? వివరాల్లోకి వెళెతే..
పెళ్లిళ్లు.. శుభకార్యాలు అనగానే మహిళలకు వెంటనే గుర్తుకు వచ్చేంది బంగారం. బంగారం మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది. పండుగలు, ఏ ఇతర శుభకార్యాలకైనా పసిడి కొనుగోలు చేయడం.. పెట్టుబడిగా పెట్టడం సర్వ సాధారం. ఇటీవల పసిడి ధరలు అమాంతం పెరిగిపోతూ వచ్చాయి. దీంతో పాటు వెండి ధరలు కూడా పెరిగిపోయాయి. క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ.10 తగ్గి, రూ.67,590 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, రూ.73,740 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.73,630 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.73,790 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,010 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.73,630 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.99,600, కోల్‌కొతాలో రూ. 95,100, బెంగుళూరులో రూ. 95,300 వద్ద కొనసాగుతుంది.