Dharani
బులియన్ మార్కెట్ విశ్లేషకులు పసిడి ప్రియులకు శుభవార్త చెప్పారు. బంగారం ధర స్థిరంగా ఉండనుంది అంటున్నారు. కారణమిదే..
బులియన్ మార్కెట్ విశ్లేషకులు పసిడి ప్రియులకు శుభవార్త చెప్పారు. బంగారం ధర స్థిరంగా ఉండనుంది అంటున్నారు. కారణమిదే..
Dharani
బంగారం.. దీనితో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. మనం బాగా ప్రేమించే వారిని సైతం బంగారం అని పిలుచుకుంటాం. మన దేశంలో ఓ మనిషి దగ్గర ఎంత ఎక్కువ పసిడి ఉంటే.. వారు అంత ధనవంతులు అని లెక్కిస్తారు. ఇక సందర్భం దొరికిన ప్రతి సారి ఎంతో గోల్డ్ కొనుగోలు చేయడానికి మన వాళ్లు ఆసక్తి చూపుతారు. పండుగలు, శుభకార్యాల వేళ పుత్తడి కొంటే శుభసూచకం అని నమ్ముతారు. ఇక ఈ మధ్య కాలంలో ధన్‌తేరాస్, అక్షయ తృతీయ వంటి పండుగల వేళ బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి గాను జ్యువెలరీ షాపు యజమానులు.. భారీ ఎత్తున ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తరుగు, మేకింగ్ చార్జీలు వంటి వాటి మీద భారీ ఎత్తున డిస్కౌంట్ ఇస్తూ.. కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి.
ఇక ఏప్రిల్ నెల అంతా బంగారం రేటు.. రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోయింది. ఈ దూకుడు ఇలానే కొనసాగితే.. సమీప భవిష్యత్తులో గోల్డ్ రేటు తులం లక్ష రూపాయలు అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దాంతో చాలా మంది బంగారం కొనాలా వద్దా అనే సంశంయంలో పడిపోయారు. అయితే ఏప్రిల్ నెలంతా అడ్డు అదుపు లేకుండా దూసుకుపోయిన గోల్డ్ రేటు.. మే నెల ప్రారంభం నుంచి దిగి రావడం ప్రారంభించింది. అందుకు కారణం.. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న పరిణామాలు.
సాధారణంగా బంగారం రేటులో మార్పు అనేది యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లతో ముడిపడి ఉంటుంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే.. డాలర్, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గిపోయి అప్పడు బంగారానికి ఊహించని రీతిలో డిమాండ్ పెరుగుతుంది. దీంతో పసిడి రేటు ఊహించని రీతిలో పెరుగుతుంది. ఆ ప్రకటనతోనే ఇటీవల బంగారం ధర భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుంది. దానిని తగ్గించేందుకు వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం లేదా పెంచే పరిస్థితుల్ని కల్పిస్తోంది.
దీంతో వరుసగా ఆరోసారి కూడా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే బంగారం ధరలు ఇక పెరిగే అవకాశం లేదని.. అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. ఫెడ్ వడ్డీ రేట్లు పెరిగితే పసిడి ధరలు తగ్గుతాయి.. లేదంటే నామ మాత్రంగా పెరుగుతుంది తప్ప.. భారీగా పెరిగే అవకాశం మాత్రం ఉండదు అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. కనుక బంగారం కొనాలనుకునేవారు కొన్ని రోజులు ఆగితే మంచిది అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు.
ఇక నేడు హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ పసిడి ధర పది గ్రాముల మీద 300 రూపాయలు పెరిగి రూ. 66,350 మార్కు వద్ద ఉంది. అలానే 24 క్యారెట్ మేలిమి పుత్తడి రేటు కూడా పది గ్రాముల మీద 330 రూపాయలు పెరిగి.. రూ. 72,380 వద్ద కొనసాగుతోంది. అలానే ఢిల్లీలో బంగారం రేటు పైకి ఎగబాకింది. 22 క్యారెట్ బంగారం పది గ్రాముల మీద 300 రూపాయలు పెరిగి రూ. 66,500 పలుకుతుండగా.. 24 క్యారెట్ల ధర రూ. 330 ఎగబాకి 10 గ్రాములు రూ. 72,530 వద్ద ఉంది.