iDreamPost
android-app
ios-app

వినాయక చవితి రోజు భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి

  • Published Sep 07, 2024 | 11:36 AM Updated Updated Sep 07, 2024 | 11:36 AM

Today Gold and Silver Prices: బంగారం ప్రియులకు భారీ గుడ్ న్యూస్. వినాయక చవితి రోజు పసిడి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు తులం బంగారం ధర ఎంత ఉందంటే?

Today Gold and Silver Prices: బంగారం ప్రియులకు భారీ గుడ్ న్యూస్. వినాయక చవితి రోజు పసిడి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు తులం బంగారం ధర ఎంత ఉందంటే?

వినాయక చవితి రోజు భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి

మనదేశంలో మగువలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. పండగలు, శుభకార్యాలకు గోల్డ్ కొనుగోలు చేస్తుంటారు. పసిడిపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బంగారంపై దిగుమతి సుంకం తగ్గింపు తర్వాత గోల్డ్ ధరలు నేలచూపు చూశాయి. ఇక ఆ తర్వాత పుత్తడి ధరలు ఒకరోజు పెరుగుతూ.. మరో రోజు తగ్గుతూ పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి. దీంతో బంగారం కొనాలనుకునే వారు ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని చూస్తున్నారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. పండగ పూట బంగారం ధరలు భారీగా తగ్గాయి. పసిడి ప్రియులకు ఇదే మంచి ఛాన్స్. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. నేడు తులం బంగారంపై ఎంత తగ్గిందంటే?

వినాయక చవితి నాడు గోల్డ్ ధరలు భారీగా దిగొచ్చాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై ఏకంగా రూ. 400 తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 440 తగ్గింది. నేడు హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 400 తగ్గడంతో రూ. 66800 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 440 తగ్గడంతో రూ. 72870 వద్ద అమ్ముడవుతోంది. విశాఖ పట్నం, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశరాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66800 వద్ద కొనసాగుతున్నది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 72870 వద్దకు చేరింది.

వెండి ధరలు:

బంగారం ధరల బాటలోనే వెండి ధరలు పయనిస్తున్నాయి. నేడు సిల్వర్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. పండగ వేళ కిలో సిల్వర్ పై రూ. 2500 తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 89500 వద్ద కొనసాగుతున్నది. విజయావాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 84,500 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం పడిపోవడం వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి.