P Krishna
P Krishna
ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికీ బంగారం, వెండికి డిమాండ్ ఉంటూనే ఉంది. కానీ కొన్ని పరిణిమాల నేపథ్యంలో బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులు అవుతూ వస్తున్నాయి. ఒకసారి బంగారం ధర పెరిగితే వెండి ధర తగ్గుతుంది.. వెండి పెరిగితే.. పసిడి ధర తగ్గుతుంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా పసిడి, వెండి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఇది బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త అంటున్నారు నిపుణులు. నేటి బంగారం, వెండి ధరల ఎలా ఉన్నాయంటే..
బంగారం అంటే భారతీయులు ఎంతో మక్కువ చూపిస్తుంటారు. ప్రతి శుభకార్యానికి, పండుగలకు అంతో ఇంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. అందుకే బంగారానికి మన దేశంలో ఎంతో డిమాండ్ ఉంది. గత కొన్నిరోజులుగా పసిడి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్ లో నేటి ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.57,370 గా నమోదు కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.52,590 గా ట్రెండ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర రూ.400 తగ్గిపోగా.. ప్రస్తుతం రూ.73,100గా కొనసాగుతుంది.
దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.52,750 గా నమోదు కాగా, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.57,530 గా నమోదు అవుతుంది. ముంబైలో 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.57,370 గా నమోదు కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.52,590 గా నమోదు ట్రెండ్ అవుతుంది. కోల్ కొతా, బెంగుళూరు, కేరళాలో కూడా ఇదే రేటు కొనసాగుతుంది. చెన్నైలో 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.57,650 గా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.52,850గా కొనసాగుతుంది. ఇక కలో వెండి విషయానికి వస్తే.. ఢిల్లీ, ముంబైలో రూ.70,700 గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.73,100, బెంగుళూరులో రూ.69,000, కోల్‌కొతా రూ.70,700, కేరళాలో రూ.73,100 గా కొనసాగుతుంది.