iDreamPost
android-app
ios-app

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు షాక్. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి బంగారం ధరలు. గోల్డ్ తో పాటు వెండి ధరలు కూడా షాకిస్తున్నాయి. నేడు తులం బంగారం ధర ఎంతుదంటే?

పసిడి ప్రియులకు షాక్. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి బంగారం ధరలు. గోల్డ్ తో పాటు వెండి ధరలు కూడా షాకిస్తున్నాయి. నేడు తులం బంగారం ధర ఎంతుదంటే?

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

బంగారం ధరలు పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి. శుభకార్యాల సీజన్ కొనసాగుతుండడంతో దేశ వ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు పెరిగాయి. పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు, ఇతర ఫంక్షన్ల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇక బంగారాన్ని ఆభరణాలుగానే కాకుండా పెట్టుబడి మార్గంగా కూడా చూస్తున్నారు. గోల్డ్ ధరలు పెరుగుతుండడంతో బంగారంపై ఇన్వెస్ట్ చేస్తే సమీప భవిష్యత్తులో అధిక లాభాలు అందుకోవచ్చని భావిస్తున్నారు. అదే విధంగా బంగారం కొని పెట్టుకుంటే ఆపద సమయంలో ఆదుకుంటుందని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. మరి తగ్గినట్టే తగ్గి షాకిస్తున్న బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. ఈ రోజు తులం ఎంత ఉందంటే?

పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులు, దేశాల మధ్య యుద్ధాలు, రూపాయితో డాలర్ మారకం విలువ పడిపోవడం వంటివి పుత్తడి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. రికార్డ్ స్థాయిలో బంగారం, వెండి ధరలు పెరుగుతుండడంతో పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ రోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులిన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగింది.

today gold rate

దీంతో నిన్న రూ.66,650 ఉండగా నేడు పెరిగిన ధరలతో రూ.66,660కి చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల తులం బంగారం ధరపై రూ. 10 పెరగగా నిన్న రూ.72,710 వద్ద ట్రేడ్ అయిన గోల్డ్ నేడు రూ.72,720కి చేరింది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,660 వద్దకు చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.72,720 వద్ద అమ్ముడవుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,560 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,700కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,810కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,870వద్ద ట్రేడ్ అవుతోంది.

బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. వెండి ధరలు సైతం రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. బంగారంతో పాటు సిల్వర్ ధరలు పెరుగుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. నేడు కిలో వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో నిన్న రూ. 84,500 ఉండగా నేడు పెరిగిన ధరలతో రూ. 84,600 కి చేరింది.