nagidream
Get Huge Profits By Invest In These Locality: స్థలం కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు స్థలాల ధరలు తగ్గాయి. మీరు ఇప్పుడు స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక కనీసం 8 లక్షలైనా లాభం పొందే అవకాశం ఉంది.
Get Huge Profits By Invest In These Locality: స్థలం కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు స్థలాల ధరలు తగ్గాయి. మీరు ఇప్పుడు స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక కనీసం 8 లక్షలైనా లాభం పొందే అవకాశం ఉంది.
nagidream
ట్విన్ సిటీస్ లో ఎక్కడ ప్రాపర్టీ కొన్నా కానీ లాభమే తప్ప నష్టం అనేది ఉండదు. ట్విన్ సిటీస్ అనే కాదు.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ స్థలం కొనుగోలు చేసినా గానీ లాభమే. అయితే ఇటీవల రియల్ ఎస్టేట్ కొంచెం డల్ అయిన మాట వాస్తవమే. కానీ ఇది ఇలానే కొనసాగుతుంది అనుకుంటే పొరపాటే. మళ్ళీ ఈ ధరలు పెరుగుతాయి. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే అదును చూసి పదడుగులు ముందుకు వేయడానికే అంటారు కదా. అలా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కాస్త డౌన్ అయినా అంతకు మించి రెట్టింపు ధరలతో దూసుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు కొన్నవారికి ఎంత తగ్గిందో అంత లాభం రావడమే గాక ఈ రేట్లు మరింత పెరిగితే కనుక ఇంకా లాభం పొందవచ్చు.
సికింద్రాబాద్ లో అల్వాల్ లో ప్రస్తుతం ధరలు తగ్గాయి. అల్వాల్ లో గత ఏడాది చదరపు అడుగు స్థలం ధర రూ. 6,850 ఉండగా అదే ఏడాది ఏప్రిల్-జూన్ నెలల్లో 7,200కి పెరిగింది. జూలై-సెప్టెంబర్ నెలల్లో 8,350కి పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో మాత్రం రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యింది. దీంతో అల్వాల్ లో స్థలాల ధరలు కూడా తగ్గాయి. జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు స్థలం రూ. 7,800కి తగ్గింది. జూన్ నాటికి రూ. 7,150కి పడిపోయింది. ఇవన్నీ యావరేజ్ ధరలు. యావరేజ్ గా చదరపు అడుగు మీద రూ. 650 తగ్గింది. 650 రూపాయలు అంటే మీరు ఒక 1200 చదరపు అడుగుల స్థలం కొంటే గనుక కనీసం 8 లక్షలు మిగులుతాయి. 8 లక్షలు మిగలడమే గాక ఈ రేట్లు పెరిగినప్పుడు లాభం వస్తుంది.
ఇప్పుడు చదరపు అడుగు స్థలం రూ. 7,150గా ఉంది. ఈ ధర రూ. 7,800 అయితే 8 లక్షలు లాభం వచ్చినట్టే. ఇంకా ఎక్కువ పెరిగితే ఇంకా ఎక్కువ లాభం పొందే అవకాశాలు ఉంటాయి. ఈ తగ్గిన ధరలు 2 నెలల్లో పెరగొచ్చు, 3 నెలల్లో పెరగొచ్చు.. లేదా 6 నెలల్లో పెరగొచ్చు. ఎప్పుడు పెరిగినా గానీ లాభమే తప్ప నష్టం ఉండదు. కాబట్టి స్థలం మీద ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునేవారికి ఇదే సరైన అవకాశం. కూకట్ పల్లి, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ఏరియాలు అల్వాల్ ఏరియాకి దగ్గరగా ఉండడం మరొక బెనిఫిట్.
గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.