iDreamPost
android-app
ios-app

మార్కెట్ లోకి కొత్త EV.. సింగిల్ ఛార్జ్ తో 560KM రేంజ్

Mercedes-Benz EQA: ఈవీ ప్రియులకు కళ్లు చెదిరే ఫీచర్లతో సరికొత్త ఈవీ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ భారతీయ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది.

Mercedes-Benz EQA: ఈవీ ప్రియులకు కళ్లు చెదిరే ఫీచర్లతో సరికొత్త ఈవీ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ భారతీయ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది.

మార్కెట్ లోకి కొత్త EV.. సింగిల్ ఛార్జ్ తో 560KM రేంజ్

భారత మార్కెట్ లో ఈవీల హవా కొనసాగుతున్నది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు, బైక్స్, స్కూటీలు మార్కెట్ లోకి విడుదలై వాహనదారుల నుంచి విశేషమైన ఆదరణ పొందుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. తక్కువ ఖర్చుతోనే ప్రయాణించే వీలుండడం కారణంగా ఈవీల సేల్స్ రోజురోజుకు పెరుగుతున్నది. ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలన్నీ ఈవీల తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో భారతీయ మార్కెట్ లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వచ్చింది. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడేజ్ బెంజ్ అందించే చౌకైన ఈక్యూఏ ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేసింది.

మెర్సిడేజ్ బెంజ్ కార్లకు డిమాండ్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ గా ఈ కంపెనీ కార్లకు క్రేజ్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లతో సత్తా చాటేందుకు సిద్ధమైంది. మెర్సిడేజ్ బెంజ్ ఈక్యూఏ అనే సరికొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ ను కూడా కంపెనీ ప్రారంభించింది. ఈ కారు డెలివరీలు 2025లో ప్రారంభంకానున్నాయి. ఇక ఈ ఎలక్ట్రిక్ కారు ఈవీ ప్రియులను తెగ ఆకట్టుకుంటుంది. కొత్త ‘మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ’ 250 ప్లస్ అనే ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ. 66 లక్షలు (ఎక్స్ షోరూమ్).

స్టన్నింగ్ డిజైన్ తో అద్భుతమైన ఫీచర్లతో దుమ్మురేపుతుంది ఈక్యూఏ. ఈ కారు పోలార్ వైట్, కాస్మోస్ బ్లాక్, మౌంటైన్ గ్రే, హై-టెక్ సిల్వర్, స్పెక్ట్రల్ బ్లూ, పటగోనియా రెడ్ మెటాలిక్, మౌంటైన్ గ్రే మాగ్నో అనే ఏడు కలర్స్ లో అందుబాటులో ఉంది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఆగ్మెంటెడ్ రియాలిటీ మావిగేషన్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా వంటి లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ను కలిగి ఉంది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ 70.5 కిలోవాట్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. సింగిల్ చార్జ్ తో 560 కి.మీల వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. 8.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ స్పీడును అందుకుంటుంది. గంటకు 160 కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది. ఈక్యూఏ ఎలక్ట్రిక్ కారు 100 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 35 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది.