Vinay Kola
Hyderabad: హైదరాబాద్‌లో గ్యాస్ రేట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దసరా సమయంలో హైదరాబాద్ గ్యాస్ వినియోగదారులకు పెద్ద షాక్ తగిలింది.
Hyderabad: హైదరాబాద్‌లో గ్యాస్ రేట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దసరా సమయంలో హైదరాబాద్ గ్యాస్ వినియోగదారులకు పెద్ద షాక్ తగిలింది.
Vinay Kola
ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఆయిల్ కంపెనీలు విజృంభిస్తున్నాయి. షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గతంలో వరుసగా గ్యాస్ ధరల్ని తగ్గించాయి. తరువాత మళ్లీ పెంచుతున్నాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లలో మార్పులు చేయలేదు. కానీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని మాత్రం భారీగా పెంచుతున్నాయి. ఇలా ధరలు పెంచడం ఇది వరుసగా మూడోసారి. తాజాగా 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అక్టోబర్ 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ రేటు అంతకుముందు రూ. 1691.50 ఉండేది. ఇప్పుడు మరో రూ. 48.50 పెరిగింది. దాంతో ఇప్పుడు గ్యాస్ ధర రూ. 1740 అయ్యింది. గడిచిన సెప్టెంబర్ నెలలో రూ. 39 పెరిగింది. ఇక ఆగస్టు నెలలో కూడా కొంచెం పెరిగింది. అయితే వీటికి ముందు మాత్రం వరుసగా 4 నెలల్లో దాదాపు రూ. 150 కిపైగా తగ్గాయి. ఇప్పుడు మళ్ళీ పెరిగాయి.
ఇక దేశంలోని ప్రధాన మెట్రో సిటీల్లో చూసినట్లయితే.. ముంబైలో రూ. 48.50 పెరిగింది. అక్కడ 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1692.50 అయ్యింది. బెంగళూరులో రూ. 48.50 పెరిగింది. దాంతో ఇప్పుడు 19 కిలోల సిలిండర్ రేటు రూ. 1818 అయ్యింది. హైదరాబాద్ నగరంలో 19 కిలోల గ్యాస్ ధర రూ. 48 పెరిగింది. దీంతో హైదరాబాద్ లో ఇప్పుడు రూ. 1967 పలుకుతోంది. కోల్‌కతాలో రూ.1802 నుంచి రూ.1850.50కి, చెన్నైలో రూ.1855 నుంచి రూ.1903కి పెరిగాయి. ఈ మెట్రో నగరాల్లో చూస్తే.. హైదరాబాద్‌లోనే గ్యాస్ రేట్లు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో దసరా పండుగ సమయంలో హైదరాబాద్ కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఇంకా పెద్ద షాక్ తగిలింది. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందడం వలన ధరలు కూడా అభివృద్ధి చెంది పెరిగిపోతున్నాయి. ఇలా అయితే హైదరాబాద్ లో నివసించే వారికి షాకులు తప్పవు.
ఈ విధంగా కమర్షియల్ గ్యాస్ రేట్లని పెంచాయి ఆయిల్ కంపెనీలు. అయితే మనం ఇంట్లో వాడే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం ఈ రేట్లు చూసుకునట్లైతే ఢిల్లీలో రూ. 803, ముంబైలో రూ. 802.50, చెన్నైలో రూ. 805.50 ఉండగా.. కోల్కతాలో రూ.829, బెంగళూరు రూ. 805.50 ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో మాత్రం వంట గ్యాస్ ధర రూ. 855 ఉంది. దీంట్లో కూడా హైదరాబాద్ టాప్. ఇలా ఇంట్లో వాడే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని, పాత ధరలే యథాతథంగా కొనసాగుతాయని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను మారుస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు కూడా మార్చిన ధరలను ప్రకటించాయి. ఇక పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.