P Venkatesh
మీరు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే తక్కువ ధరకే సరికొత్త ఈవీ అందుబాటులో ఉంది. మీరు కేవలం 64 వేలకే ఈవీని దక్కించుకోవచ్చు.
మీరు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే తక్కువ ధరకే సరికొత్త ఈవీ అందుబాటులో ఉంది. మీరు కేవలం 64 వేలకే ఈవీని దక్కించుకోవచ్చు.
P Venkatesh
ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు వస్తున్న ఆదరణతో టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త మోడళ్లను రూపొందిస్తూ మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ బైక్ లు, స్కూటర్లు, కార్లు ఈవీ రంగంలో హల్ చేస్తున్నాయి. ధరలు అందుబాటులో ఉండడం, ఖర్చు కూడా తక్కువ అవుతుండడంతో ఈవీల కొనుగోలుకే వాహనదారులు మొగ్గు చూపుతున్నారు. ఈవీ రంగంలో ఓలా, ఏథర్, ఐవూమీ, హీరో, టీవీఎస్ ఇంకా ఇతర టూవీలర్ కంపెనీలు ఈవీలను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలో వాహనదారులకు మరో ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్కూటర్ ను నడిపేందుకు లైసెన్స్ కూడా అవసరం లేదు. ధర కూడా 64 వేలే.
ఈవీ టూవీలర్ తయారీ కంపెనీ ఫుజియామా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. థండర్ ప్లస్ పేరుతో ఈ స్కూటర్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. థండర్ ప్లస్ స్కూటర్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. అవి థండర్ వీఎల్ఆర్ఏ, థండర్ ఎల్ఐ. ఈ రెండు స్కూటర్లు లో-స్పీడ్ వెహికిల్ విభాగంలో అందుబాటులో ఉండనున్నాయి. థండర్ ప్లస్ స్కూటర్ ఎల్ఐ వేరియంట్ ధర రూ. 64,990తో ప్రారంభం కానుంది. థండర్ ప్లస్ స్కూటర్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. ఈ స్కూటర్‌లో 250 వాట్ల మోటార్ ను ఉపయోగించారు.
సింగిల్ ఛార్జ్ తో 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. ఇందులో 48వీ 28ఏహెచ్ వీఎల్ఆర్ఏ బ్యాటరీని అందించారు. ఇది తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావడంతో దీనిని నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. థండర్ ఎల్ఐ వేరియంట్ ఇది కూడా స్లో స్పీడ్ వేరియంట్. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. లో స్పీడ్ స్కూటర్ కాబట్టి లైసెన్స్ అవసరం లేదు. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్లతో కూడిన ఎల్ఈడీ హెడ్‌లైట్స్, రిమోట్ లాక్ అండ్ అన్లాక్ ఫీచర్లను వీటిల్లో అందించారు.