Dharani
Petrol Bunk: పెట్రోల్ బంకుల్లో రకరకాల మోసాలు వెలుగు చూస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. మరీ ముఖ్యంగా కారులో కూర్చొని పెట్రోల్ కొట్టించే సమయంలో ఈ తరహా మోసాలు జరుగుతున్నాయి. ఆ వివరాలు..
Petrol Bunk: పెట్రోల్ బంకుల్లో రకరకాల మోసాలు వెలుగు చూస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. మరీ ముఖ్యంగా కారులో కూర్చొని పెట్రోల్ కొట్టించే సమయంలో ఈ తరహా మోసాలు జరుగుతున్నాయి. ఆ వివరాలు..
Dharani
మోసం చేయడం ఎంత తప్పో.. మోసపోవడం కూడా మన తప్పే అవుతుంది. మోసాలు జరిగే అవకాశం ఉందని తెలిసినా.. బద్దకం, నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల మోసపోతుంటాము. సైబర్ మోసాలకు గురవుతున్న వారిలో ఎక్కువగా బాగా చదువుకున్న వారే ఉండటం గమనార్హం. ఇక నేటి కాలంలో మోసాలకు తావు లేని చోటు లేదంటే అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రతి చోట జాగ్రత్తగా ఉండాలి. ఇక పెట్రోలు బంకుల్లో జరిగే మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పెట్రోల్ బదులు నీళ్లు రావడం.. మీటర్ సరిగా లేకపోవడం వంటి మోసాల గురించి తరచుగా వింటూ ఉంటాం.. చూస్తూ ఉంటాం. ఈ క్రమంలో పెట్రోల్ బంకుల్లో జరిగే మరో రకం మో వెలుగులోకి వస్తున్నాయి. బంకుకు వెళ్లి పెట్రోల్ కొట్టించే వారు.. ముఖ్యంగా కార్లు ఉన్నా వారు చాలా జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే మీరు మోసపోతున్నారు. ఎలానో తెలియాలంటే ఇది చదవండి. ఆవివరాలు..
పెట్రోల్ బంకుల్లో వాహనదారులు అనేక రకాల మోసాలకు గురవుతుంటారు. మరీ ముఖ్యంగా పెట్రోల్ కొట్టించే వేళ ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని.. మరీ ముఖ్యంగా కారులో కూర్చొని పెట్రోల్ కొట్టించే వారు.. మోసపోయే అవకాశం ఎక్కువ కనుక.. వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగా బైక్‌కి పెట్రోల్ కొట్టించేటప్పుడు మీటర్ తిరుగుతుందా.. ఇంధనం బైక్ ట్యాంకర్‌లో పడుతుందా లేదా అనే విషయం మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇది మన కళ్ల ముందే జరుగుతుంది. కనుక బైక్‌లో పెట్రోల్ కొట్టించే సమయంలో మోసం జరగడం చాలా అరుదు.
కానీ స్కూటీ, కారులో పెట్రోల్ కొట్టించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. వీటికి పెట్రోల్ ట్యాంక్‌లు వెనక భాగంలో ఉంటాయి. మనం ముందు కూర్చుని.. ఎంత పెట్రోల్ కావాలో చెప్పి.. రీడింగ్ తిరుగుతుందా లేదా అన్నిది గమనిస్తూ ఉంటాం. కానీ నిజంగానే పెట్రోల్.. కారు ట్యాంక్‌లో పడుతుందా లేదా.. అన్నది మీకు తెలియదు. ఎందుకంటే మీరు కారులో ముందు కూర్చొని ఉన్నారు. వెనక ఏం జరుగుతుందో మీకు కనిపించదు. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని పెట్రోల్ బంకుల్లో.. మోసాలకు పాల్పడుతున్నారు. రీడింగ్ పరుగులు పెడుతుంది కానీ.. గన్ నుంచి పెట్రోల్ మీ కారులో పడదు.
మీరు కారులో కూర్చుని ఉంటారు కనక.. వెనక ఏం జరుగుతోందో చూడలేరు. దాన్ని అవకాశంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. కనుక ఇక మీదటనైనా జాగ్రత్తగా ఉండాలని.. పెట్రోల్ కొట్టించే సమయంలో కారు దిగి బయటకు వచ్చి.. రీడింగ్, డెన్సిటీ, ట్యాంక్‌లో ఇంధనం పడుతుందా లేదా అన్న విషయాలను గమనించుకోవాలి. లేదంటే మీరు భారీ ఎత్తున మోస పోయే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి.