ఫోర్డ్ భారత్ కు ఎందుకు తిరిగి వస్తోంది.. అసలు కారణం ఇదే?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ భారత్ లో కార్ల ఉత్పత్తిని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఫోర్డ్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి గల కారణం ఏంటంటే?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ భారత్ లో కార్ల ఉత్పత్తిని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఫోర్డ్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి గల కారణం ఏంటంటే?

అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటార్స్ భారత మార్కెట్ లో రెండేళ్ల క్రితం కార్ల ఉత్పత్తిని నిలిపి వేసిన విషయం తెలిసిందే. కాగా ఫోర్డ్ మళ్ళీ భారత్ లో కార్ల ఉత్పత్తిని పున:ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. గతంలో ఫోర్డ్ కార్లకు మార్కెట్ లో డిమాండ్ లేక ఇటు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా కూడా సేల్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది. ఈ కారణంతో ఫోర్డ్ కంపెనీ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ఈ క్రమంలో చెన్నై సమీపంలోని మరైమలై నగర్ లో ఉన్న ఫోర్డ్ ప్రోడక్షన్ యూనిట్ విక్రయానికి పలు ఆటోమైబైల్ సంస్థలతో సంప్రదింపులు జరిపింది. కానీ చెన్నై ప్లాంట్ విక్రయం ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది.

ఆ ప్లాంట్ విక్రయానికంటే తిరిగి కార్ల ఉత్పత్తిని ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఫోర్డ్ మోటార్స్ భావిస్తున్నట్లు సమాచారం. భారత్ మార్కెట్ లో ఎస్ యూవీలకు ఫుల్ డిమాండ్ ఉంది. ఫోర్డ్ రీ ఎంట్రీలో భాగంగా భారత మార్కెట్ లో తన ప్రీమియం ఎస్ యూవీ థర్డ్ జనరేషన్ ఎండీవర్ ఆవిష్కరించాలని ఫోర్డ్ మోటార్స్ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చెన్నై గుజరాత్ రాష్ట్రాల్లో ఫోర్డ్ మోటార్స్ కు ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్ లో విస్తరించేందుకు చైన్నై ప్లాంట్ లో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని ఫోర్డ్ విరమించుకుంది.

ఇటీవల ఫోర్డ్ మోటార్స్ సీఓఓగా భారత సంతతికి చెందిన కుమార్ గన్హోత్రా భాద్యతలను స్వీకరించడంతో మళ్లీ ఫోర్డ్ కంపెనీ భారత మార్కెట్ లోకి రీ ఎంట్రీ ఇస్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. 1996 లో తన ఎస్కార్ట్ కార్ తో ఉత్పత్తి చేసి విక్రయాలను భారత్ లో ప్రారంభించింది. ఆ తర్వాత ఐకాన్ ఫిగో, ఎకో స్పోర్ట్, ఎండీవర్ మోడళ్లను ఆవిష్కరించింది. ఇప్పుడు రీ ఎంట్రీలో భాగంగా టయోటా, ఫార్చునర్ కు పోటీగా ఎండీవర్ ను తీసుకురానుంది. ఫోర్డ్ ఎండీవర్ కారును భారత్ మార్కెట్ లో లాంచ్ చేస్తే మునుపటి కంటే స్టన్నింగ్ డిజైన్, ఆధునిక ఫీచర్ల తో ప్రవేశ పెట్టాలని ఫోర్డ్ భావిస్తోంది. ఫోర్డ్ ఎండీవర్ 2 లీటర్ టర్బో డీజిల్, 3 లీటర్ వి6 టర్బో డీజిల్ ఇంజిన్ల ఎంపికతో రానున్నట్లు సమాచారం.

Show comments