P Krishna
Zomato and Swiggy: ఒకప్పుడు ఏదైనా ఇష్టమైన ఫుడ్ తినాలంటే హైటల్, రెస్టారెంట్స్ వెళ్లి తినేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తమకు ఇష్టమైన ఏ ఫుడ్ అయినా క్షణాల్లో తీసుకు వచ్చే సౌలభ్యం సిగ్వీ, జొమాటో సంస్థలు కల్పించాయి.
Zomato and Swiggy: ఒకప్పుడు ఏదైనా ఇష్టమైన ఫుడ్ తినాలంటే హైటల్, రెస్టారెంట్స్ వెళ్లి తినేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తమకు ఇష్టమైన ఏ ఫుడ్ అయినా క్షణాల్లో తీసుకు వచ్చే సౌలభ్యం సిగ్వీ, జొమాటో సంస్థలు కల్పించాయి.
P Krishna
ఇటీవల దేశంలో ఫుడ్ డెలివరీకి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది.. తమకు నచ్చిన ఆహారాన్ని ఇంటి వద్దకే తీసుకు వచ్చే సౌకర్యం సిగ్వీ, జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థలు కల్పించాయి. పట్టణాలు, నగరాల్లో ఉద్యోగులు, విద్యార్థులు, కొత్తగా పెళ్లైన జంటలు ఎక్కువగా సిగ్వీ, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్ సిగ్వీ, జొమాటో ఆర్డర్ చేయడం కామన్ అయ్యింది. తమకు నచ్చిన ఆహారం, తక్కువ సమయంలో ఇంటికి వస్తుంది. దీంతో గత కొంత కాలంగా ఈ రెండు సంస్థలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సిగ్వీ, జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థలు కీలక ప్రకటన చేశాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఫుడ్ డెలివరీ సంస్థలు అయిన జొమాటో, సీగ్వీ కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చాయి. మహా నగరాల్లో డిమాండ్ అధికంగా ఉండటంతో ఫ్లాట్ ఫామ్ ఫీజు పెంచుతున్నట్లు ఫుడ్ డెలివరీ సంస్థలు సిగ్వీ, జొమాటో ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ, బెంగుళూరు లాంటి నగరాల్లో ఫ్లాట్ ఫామ్ ఫీజు ఇకపై 6 రూపాయలు చేసినట్లు తెలపింది. గతంలో ఈ ఫీజు రూ.5 గా ఉండేది. దీంతో ఫ్లాట్ ఫామ్ ఫీజు ఇప్పుడు 20 శాంత మేర పెరిగినట్లయ్యింది. బెంగుళూరులో ఫీజును సీగ్వి మొదట రూ.7 గా నిర్ణయించినా.. తర్వాత రాయితీ ఇచ్చి రూ.6 గా ఫిక్స్ చేసింది. గతంలో జొమాటో-సిగ్వీలు తమ ఫ్లాట్ ఫాం రేటు ఒకేసారి పెంచాయి. 2023 లో ఈ తరహా ఫీజును మొదలు పెట్టాయి. మొదట 2 రూపాయలు.. తర్వాత 5 రూపాయలకు ఫిక్స్ చేసింది. బెంగుళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద, లఖన్‌పూ నగరాల్లో ఈ పెంపు వర్తింపజేసింది. ఫాస్ట్ డెలివరీ కోసం అవసరాలను బట్టి ఫీజు ప్రత్యేకంగా వసూలు చేయబడుతుంది.
సిగ్వీ, జొమాటో ఒక్కో ఆర్డర్ పై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా డెలివరీ యాప్ లు ఈ తరహా ఫీజులు పెంచడం మొదలు పెట్టాయి. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ లో ఈ రెండు సంస్థలు అగ్రగామిగా నిలిచాయి.. దీంతో డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఈ రెండు సంస్థలు ఆదాయంతో పాటు లాభాలు కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రోజుకు రూ.1.25 నుంచి రూ.1.5 కోట్ల ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సిగ్వీ, జొమాటో లకు చెందిన క్విక్ కామర్స్ వేధికలైన బ్లింకిట్, ఇన్‌స్ట్రామార్ట్ హ్యాండ్లింగ్ చార్జీల పేరిట వసూళ్లు చేస్తున్నారు. ఇక ఢిల్లీలో ఈ చార్జీలు రూ.16, రూ.5 గా ఉండగా, బెంగుళూరులో ఒక్కో ఆర్డర్ పై రూ.4, ఇన్‌స్ట్రామార్ట్ రూ.5 వసూళ్లు చేస్తుంది.తాజాగా పెంచిన ఫ్లాట్ ఫామ్ ఫీజ్ కస్టమర్లకు మరింత భారం కానున్నాయని అంటున్నారు.