iDreamPost
android-app
ios-app

ఫుడ్ డెలివరీ బాయ్ గా Zomato సీఈఓ.. చివరకు ఏం జరిగిందంటే?

  • Published Oct 08, 2024 | 3:13 PM Updated Updated Oct 08, 2024 | 3:13 PM

ఇప్పటికి వరకు జొమాటో , స్విగ్గి డెలివెరి బాయ్స్ కు సంబంధించిన వార్తలు ఎన్నో విని ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ స్టోరీ గురించే. కానీ ఇక్కడ ఏకంగా జొమాటో సీఈఓ కే అవమానం జరిగింది . అదేంటో చూసేద్దాం .

ఇప్పటికి వరకు జొమాటో , స్విగ్గి డెలివెరి బాయ్స్ కు సంబంధించిన వార్తలు ఎన్నో విని ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ స్టోరీ గురించే. కానీ ఇక్కడ ఏకంగా జొమాటో సీఈఓ కే అవమానం జరిగింది . అదేంటో చూసేద్దాం .

  • Published Oct 08, 2024 | 3:13 PMUpdated Oct 08, 2024 | 3:13 PM
ఫుడ్ డెలివరీ బాయ్ గా Zomato సీఈఓ.. చివరకు ఏం జరిగిందంటే?

ప్రస్తుతం చాలా మంది ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెడుతూనే ఉంటారు. బయటకు వెళ్లే పని లేకుండా.. ఉన్న చోటుకే అన్ని తెచ్చి పెడుతుంటే అంతకుమించి ఇంకేం కావాలి. అయితే కొంతమంది కస్టమర్ల బద్దకాన్ని.. డెలివెరీ బాయ్స్ అవకాశం గా తీసుకుంటున్నారు. వారిని బురిడీ కొట్టించి డబ్బు కాజేయడం లాంటి స్కామ్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి వార్తలు ఎన్నో విని ఉంటారు. ఇదంతా ఒక వైపు అయితే. ఎదో ఒక పని చేసి కష్టపడి డబ్బు సంపాదించనలని.. నిజాయితీగా పని చేసే వారు ఇంకొందరు. వారిని ఇబ్బందులు పెట్టే కస్టమర్స్ కూడా ఉన్నారు. స్వయంగా జొమాటో సీఈఓ దీనిని ఎక్స్పీరియెన్స్ చేశారు. ఫుడ్ డెలివెరి బాయ్ లా నార్మల్ గా వెళ్లిన ఆయనకు.. అవమానం జరిగింది. దీనితో సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకున్నారు జొమాటో సీఈఓ.

జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్.. డెలివరీ బాయ్స్ సవాళ్ళను ప్రత్యేక్షంగా ఎక్స్పీరియన్స్ చేయడానికి.. డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. ఈ క్రమంలో గురుగ్రామ్‌లోని ఓ మాల్ నుంచి ఫుడ్ ఆర్డర్ రాగా అక్కడకు చేరుకున్నారు. కానీ మాల్ కు వెళ్లిన తర్వాత అక్కడ సెక్యూరిటీ లిఫ్ట్ ను ఉపయోగించకుండా ఆపారని ఆయన తెలిపారు. ఇక తన రెండవ ఆర్డర్ లో కూడా అలాంటి కొన్ని పరిస్థితులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో డెలివరీ బాయ్స్ పనిని మెరుగుపరచడానికి.. వారు మాల్స్ తో మరింత సన్నిహితంగా పని చేయాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు ట్వీట్ చేశారు. అలాగే మాల్స్ కూడా డెలివరీ బాయ్స్ తో మరింత మానవత్వంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో అందరిని ఆలోచింపజేసేలా చేస్తుంది. ఈ పోస్ట్ కు చాలా మంది రియాక్ట్ అవుతున్నారు.

మాల్స్ లో మాత్రమే కాకుండా.. చాలా అపార్ట్మెంట్ లు , సొసైటీ లలోని లిఫ్ట్ లో డెలివరీ బాయ్స్ ను అనుమతించడం లేదంటూ.. మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి విభజన లేకుండా అందరూ లిఫ్ట్ లు ఉపయోగించడం తప్పని సరి చేయాలనీ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా దీపేందర్ గోయల్ ఈ విషయాన్నీ వెలుగు లోకి తీసుకుని వచ్చి.. అందరికి ఒక అవగాహన కల్పించారు. తరచూ డెలివరీ బాయ్స్ కు ఇలాంటి కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ దానిని ఎవరు అంతగా పట్టించుకోరు. ఇక నుంచైనా ఈ విషయాన్నీ అందరూ దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తే.. వారికి విలువ ఇచ్చినట్లు అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజమే కదా మరీ.. ఎదో ఒక పని చేసుకుని కష్టపడి బ్రతికే వారిలో వారు కూడా ఒకరు. ఎండా వానా అని తేడా లేకుండా ఆర్డర్ పెట్టిన వెంటనే సరైన సమయంలో తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. దానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. మరి అలాంటప్పుడు వారిని కూడా ఏ బేధం లేకుండా సమానంగానే చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.