iDreamPost
android-app
ios-app

పండగపూట ఫుడ్ లవర్స్‌కి జొమాటో షాక్…. ఆ ఫీజు భారీగా పెంపు!

  • Published Oct 23, 2024 | 3:53 PM Updated Updated Oct 23, 2024 | 3:53 PM

Zomato: ఆన్ లైన్‌లో ఫుడ్ డెలివరీ సౌకర్యం వచ్చినప్పటి నుంచి చాలా మంది తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. వండుకునే కష్టం లేకుండా క్షణాల్లో అనుకున్న ఫుడ్ మన దగ్గరికి వచ్చేస్తుంది. ఫుడ్ డెలివరీలో సంస్థల్లో జొమాటో, స్విగ్గీ పేరే ఎక్కువగా వినిపిస్తుంది.

Zomato: ఆన్ లైన్‌లో ఫుడ్ డెలివరీ సౌకర్యం వచ్చినప్పటి నుంచి చాలా మంది తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. వండుకునే కష్టం లేకుండా క్షణాల్లో అనుకున్న ఫుడ్ మన దగ్గరికి వచ్చేస్తుంది. ఫుడ్ డెలివరీలో సంస్థల్లో జొమాటో, స్విగ్గీ పేరే ఎక్కువగా వినిపిస్తుంది.

పండగపూట ఫుడ్ లవర్స్‌కి  జొమాటో షాక్…. ఆ ఫీజు భారీగా పెంపు!

జనరేషన్ మారుతున్నా కొద్ది జీవనశైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం నచ్చిన ఆహారం ఆర్డర్ చేసుకుంటే క్షణాల్లో మన ముందు ప్రత్యక్షమవుతుంది. భారత దేశంలో ఫుడ్ డెలివరీలో జొమాటోదే అగ్రస్థానం అని చెప్పొచ్చు. దీపావళి పండుగ వేళ జొమాటో ఫ్లాట్ ఫామ్ ఫీజు పెంచి ఫుడ్ లవర్స్ కి భారీ షాక్ ఇచ్చింది. ఇంతకు ముందు ఫ్లాట్‌ఫామ్ ఫీజు రూ.7 గా ఉండగా దాన్ని ఇప్పుడు రూ.10 కి పెంచింది. ‘పండగ సీజన్ రద్దీ సమయంలో సేవలు మరింత విజయవంతంగా కొనసాగించేందుకు ఫ్లాట్‌ఫామ్ ఫీజు పెంచాం. మా బిల్లులు చెల్లించేందుకు ఈ రుసుములు సాయపడతాయి’ అంటూ కంపెనీ తన యాప్ ద్వారా తెలియజేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పండగ సమయంలో జొమాటో ఫ్లాట్‌ఫామ్ ఫీజు పెంచి ఫుడ్ లవర్స్ కి మరోసారి షాక్ ఇచ్చింది.  గత ఏడాది ఆగస్టులో మొదటి సారి ఫ్లాట్‌ఫామ్ ఫీజు రుసుము ప్రవేశపెట్టింది. మొదటి ఆర్డర్ కు రూ.2 చొప్పున వసూలు చేసింది. ఈ ఫీజు మెల్లి మెల్లిగా పెంచుతూ వచ్చింది. తాజాగా రూ.2 నుంచి రూ.10కి తీసుకువచ్చింది. కాగా, రోజుకు ఈ ఫ్లాట్‌ఫామ్ 2-2.5 మిలియన్ల ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేస్తుందని అంచనా. ఫ్లాట్‌ఫామ్ ఫీజు పెంపు ద్వారా కంపెనీ వృద్దిపై ప్రభావం చూపనుంది. ఈ ప్రకటన తర్వాత కంపెనీ షేర్లు అనూహ్యంగా పెరిగాయి. మధ్యాహ్నం వరకు జొమాటో షేరు 2.09 శాతం పెరిగింది. ప్రస్తుతం రూ.261.75 వద్ద ట్రెండ్ అవుతుందని అంటున్నారు.

గ్రాస్ ఆర్డర్ వాల్యూ డేటా ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరానికి 2024-25 రెండో త్రైమాసికంలో హైదరాబాద్, చెన్నై మినహా మిగిలిని మెట్రోపాలిటన్ సిటీల్లో అగ్రగామిగా కొనసాగుతుందని జొమాటో సంస్థ తెలిపింది. ఇదిలా ఉంటే.. జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచడంతో ఇప్పపుడు స్విగ్గీ కూడా ఫ్లాట్‌ఫామ్ పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ వ్యాపారం ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాలకు సైతం విస్తరించింది. ప్రస్తుతం భారత దేశంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ లో స్విగ్గీ నుంచి పోటీ ఉన్నప్పటికీ జొమాటో నెంబర్ వన్ రేస్ లో దూసుకు వెళ్తుంది.