P Venkatesh
Bank Holidays in August 2024: ఖాతాదారులకు బిగ్ అలర్ట్. బ్యాంకులకు ఐదు రోజులు సెలవులు ఉండనున్నాయి. మీకు బ్యాంక్ పనులుంటే ముందే చూసుకోండి. ఏయే తేదీల్లో సెలవులు రానున్నాయంటే?
Bank Holidays in August 2024: ఖాతాదారులకు బిగ్ అలర్ట్. బ్యాంకులకు ఐదు రోజులు సెలవులు ఉండనున్నాయి. మీకు బ్యాంక్ పనులుంటే ముందే చూసుకోండి. ఏయే తేదీల్లో సెలవులు రానున్నాయంటే?
P Venkatesh
ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటున్నారు. బ్యాంక్ సేవలను వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నా.. లోన్స్ కోసం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లను కలిగి ఉంటున్నారు. ఖాతాదారులు వివిధ అవసరాల కోసం బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకోకపోతే మీ సమయం వృథా అవడంతోపాటు.. మీ పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. మరి వచ్చే తొమ్మిది రోజుల్లో బ్యాంకులకు 5 రోజులు సెలవులు రానున్నాయి. ఏయే తేదీల్లో సెలవులు ఉండనున్నాయంటే?
ఆగస్టు నెలలో బ్యాంకులకు భారీగానే సెలవులొచ్చాయి. పండగలు, ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు కలుపుకుని 10 రోజులకు పైగా హాలిడేస్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఆగస్ట్ 18 నుంచి 26 వరకు అంటే తొమ్మిది రోజుల్లోనే 5 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. అందువల్ల బ్యాంక్‌లో పని ఉంటే మాత్రం సెలవులకు అనుగుణంగా బ్యాంకింగ్ పనులు పూర్తి చేసుకోండి. అయితే ఈ సెలవులు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయని గమనించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సంబంధించిన సెలవులను ప్రకటిస్తూ ఉంటుంది.
ఈ నెలలో బ్యాంకులకు సెలవులు ఏయే తేదీల్లో ఉండనున్నాయంటే? ఆగస్టు 18న ఆదివారం కావడంతో ఆ రోజు దేశ వ్యాప్తంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇక ఆగస్ట్ 19న రక్షాబంధన్ పండుగ వచ్చింది. అంటే ఆ రోజు కూడా బ్యాంకులు పని చేయకపోవచ్చు. అందువల్ల బ్యాంకులకు వరుసగా రెండు రోజులు సెలవులు ఉండొచ్చు. ఆగస్ట్ 24న నాలుగో శనివారం వస్తుంది. ఆ రోజు కూడా బ్యాంకులు పని చేయవు. ఇక ఆ తర్వాత ఆగస్టు 25న ఆదివారం వస్తుంది. ఆగస్ట్ 26న శ్రీ కృష్ణ జన్మాష్ఠమి వచ్చింది. ఆరోజు కూడా బ్యాంకులు పని చేయవు. దీంతో బ్యాంకులు వరుసగా మూడు రోజులు బంద్ ఉంటాయి. అంటే ఆగస్ట్ 18 నుంచి 26 వరకు ఐదు రోజులు సెలవులు ఉండనున్నాయి.