iDreamPost
android-app
ios-app

EV ప్రియులకు గుడ్ న్యూస్.. క్రేజీ ఫీచర్లతో Ola నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్

ఓలా నుంచి స్కూటర్లే కాదు ఇక బైక్ లు కూడా రానున్నయి. ఓలా ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. క్రేజీ ఫీచర్లు, స్టన్నింగ్ లుక్స్ తో ఓలా ఎలక్ట్రిక్ బైక్ రానుంది.

ఓలా నుంచి స్కూటర్లే కాదు ఇక బైక్ లు కూడా రానున్నయి. ఓలా ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. క్రేజీ ఫీచర్లు, స్టన్నింగ్ లుక్స్ తో ఓలా ఎలక్ట్రిక్ బైక్ రానుంది.

EV ప్రియులకు గుడ్ న్యూస్.. క్రేజీ ఫీచర్లతో Ola నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్

ఈవీ రంగంలో తిరుగులేని శక్తిగా దూసుకెళ్తోంది ఓలా. ఇప్పటికే ఓలా విడుదల చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్కెట్ లో ఓలా స్కూటర్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఓలా స్కూటర్లు సేల్స్ లో దూసుకెళ్తూ మిగతా కంపెనీలకు గట్టి పోటినిస్తున్నాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్లో రారాజుగా కొనసాగుతున్నది ఓలా. తక్కువ సమయంలోనే ఓలా మార్కెట్ లో టాప్ లో నిలిచి సత్తా చాటుతోంది. తాజాగా ఓలా మరో ఆవిష్కరణకు సిద్ధమైంది. ఓలా నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్ రాబోతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) ప్రథమార్థ భాగంలో తొలి ఎలక్ట్రిక్ బైక్ ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.

ప్రస్తుతం ఈవీల హవా కొనసాగుతున్నది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు, కార్లను వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతోనే ప్రయాణించే వీలుండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు ఈవీలను రూపొందించే పనిలోపడ్డాయి. ఇప్పుడు ఓలా కూడా ఎలక్ట్రిక్ బైక్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నది. 2026లో డైమండ్ హెడ్, అడ్వెంచర్, రోడ్‌స్టర్, క్రూయిజర్ ఎలక్ట్రిక్ బైక్ లను ఆవిష్కరించనున్నది. ఓలా క్రూయిజర్, ఓలా అడ్వెంచర్, ఓలా రోడ్‌స్టర్, ఓలా డైమండ్ హెడ్ పేర్లతో నాలుగు మోటారు సైకిళ్లను గతేడాది ఎం1 సైబర్ రేసర్ కాన్సెప్ట్‌లో ఓలా ఎలక్ట్రిక్ ప్రదర్శించిన విషయం తెలిసిందే. రోడ్‌స్టర్ బైక్ డిజైన్ కోసం ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే పేటెంట్ కోసం రిజిస్టర్ చేసుకుంది.

ఓలా ఎలక్ట్రిక్ 2026 మొదటి ఆరు నెలల్లో ఈ ఎలక్ట్రిక్ బైక్‌లను కస్టమర్లకు డెలివరీ చేయడానికి టార్గెట్ పెట్టుకుంది. బుకింగ్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి అని భావిస్తున్నారు. బైక్‌ల బుకింగ్ వివరాలను త్వరలో విడుదల చేస్తామని ఓలా వెల్లడించింది. చంకీ టైర్లతో కూడిన అల్లాయ్ వీల్స్, యూఎస్డీ ఫోర్క్స్, ట్విన్ డిస్క్ బ్రేక్ సెటప్‌తో వస్తోంది ఓలా రోడ్ స్టర్. స్లీక్ రాప్ రౌండ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ వింకర్స్ తదితర ఫీచర్లు ఉంటాయి. ఈ బైక్ కు సంబంధించిన ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఓలా నుంచి విడుదల కానున్న తొలి ఎలక్ట్రిక్ బైక్ కోసం వాహనదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.