iDreamPost
android-app
ios-app

సెకండ్ హ్యాండ్ లో వెహికిల్ కొంటున్నారా?.. ఇంట్లో కూర్చొని కేసుల వివరాలు ఇలా తెలుసుకోండి

Second hand Vehicles: మీరు సెకండ్ హ్యాండ్ వెహికిల్స్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఆ వెహికిల్ పై ఉన్న కేసుల వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొని ఆ వివరాలను పొందొచ్చు. ఎలా అంటే?

Second hand Vehicles: మీరు సెకండ్ హ్యాండ్ వెహికిల్స్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఆ వెహికిల్ పై ఉన్న కేసుల వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొని ఆ వివరాలను పొందొచ్చు. ఎలా అంటే?

సెకండ్ హ్యాండ్ లో వెహికిల్ కొంటున్నారా?.. ఇంట్లో కూర్చొని కేసుల వివరాలు ఇలా తెలుసుకోండి

ప్రస్తుత రోజుల్లో టూవీలర్ తప్పనిసరైపోయింది. వివిధ అవసరాల కోసం టూవీలర్ ను ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోయింది. ఎక్కడికైనా వెళ్లాలన్నా, పిల్లల్ని స్కూల్ వద్ద దిగబెట్టాలన్నా, ఏవైనా సరుకులు తీసుకురావాలన్నా బైక్ లు, స్కూటర్స్ ను వినియోగిస్తుంటారు. అయితే ఆర్థికంగా ఉన్నవాళ్లు కొత్త వెహికిల్ ను తీసుకుంటుంటారు. మరికొందరు తక్కువ ధరలో దొరికే సెకండ్ హ్యాండ్ వెహికిల్స్ కోసం చూస్తుంటారు. కొన్ని కన్సల్టెన్సీ కంపెనీలు సెకండ్ హ్యాండ్ వెహికిల్స్ ను విక్రయిస్తుంటాయి. అయితే ఈ వెహికిల్స్ కు సంబంధించిన డాక్యూమెంట్స్ సరిగా ఉన్నాయో లేదో చూసుకోకపోతే చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు వాహనాలు ప్రమాదాలకు గురైనప్పుడు కేసులు నమోదవుతుంటాయి.

దొంగతనం చేసిన వాహనాలను కూడా విక్రయిస్తుంటాయి ముఠాలు. తీరా అలాంటి సెకండ్ హ్యాండ్ వెహికిల్స్ తీసుకుంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. లేని కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. మరి ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికిల్స్ మీద ఏమైనా కేసులు ఉన్నాయా? అనే విషయాలను ముందుగానే తెలుసుకుంటే ఏ ఇబ్బందులకు గురికాకుండా ఉండొచ్చు. మరి ఆ కేసుల వివరాలను తెలుసుకునేదెలా? అని ఆలోచిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త సిస్టంను తీసుకొచ్చింది. దీని ద్వారా సెకండ్ హ్యాండ్ వెహికిల్స్ పై ఉన్న కేసుల వివరాలను ఇంట్లో ఉండే ఆన్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. వెహికిల్స్ పై ఉన్న కేసుల వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ అండ్ సిస్టమ్ ను ఆవిష్కరించింది.

వాహనాలపై ఎలాంటి కేసు లేకపోతే నో ఆబ్జక్షన్ సర్టిఫికేట్ పొందొచ్చు. కేసుల వివరాలను తెలుసుకునేందుకు క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్లి www.digitalpolicecitizenservices.gov.in అని టైప్ చేయాలి. అప్పుడు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ అండ్ సిస్టమ్ విండో ఓపెన్ అవుతుంది. సిటిజన్ లాగిన్ పేరుతో డిస్ల్పే అయిన బ్లాక్ లో వివరాలు ఎంటర్ చేయాలి. ముందుగా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ బటన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీని కింద ఎంటర్ చేయాలి. తర్వాత కస్టమర్ పేరు క్యాప్చా కోడ్ ఇవ్వాలి. తర్వాత లాగిన్ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత మరొక విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వెహికిల్ ఏ రకానికి చెందిందో సెలక్ట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్, చాసిస్ నెంబర్, ఇంజిన్ నెంబర్, ఎంటర్ చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు వెహికిల్ పై కేసులు ఉంటే వాటికి సంబంధించిన వివరాలు డిస్ల్పే అవుతాయి. కేసులు లేకపోతే ఎన్ఓసీ వస్తుంది. ఈ సౌకర్యం సెకండ్ హ్యాండ్ వెహికిల్ కొనాలనుకునే వారికి ఉపయోగకరంగా ఉండనున్నది.