P Venkatesh
బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మళా సీతారామన్. లక్షలాది మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనున్నది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే?
బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మళా సీతారామన్. లక్షలాది మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనున్నది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే?
P Venkatesh
ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ అకౌంట్ దాదాపు అందరు కలిగి ఉంటున్నారు. సంపాదించిన సొమ్మును పొదుపు చేసుకునేందుకు, లోన్స్ కోసం, ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందేందుకు బ్యాంకుల్లో ఖాతాలను తెరుస్తున్నారు. అయితే అవసరాల రీత్యా చాలామంది ఒకటికంటే ఎక్కువ అకౌంట్లను కలిగి ఉంటున్నారు. బ్యాంక్ రూల్స్ ప్రకారం అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ కూడా నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే బ్యాంకులు జరిమానా విధిస్తాయి. అకౌంట్ ఇనాక్టివ్ అయిపోతుంది. ఈ క్రమంలో బ్యాంక్ ఖాతాదారులకు ఆర్థిక మంత్రి నిర్మళా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. జన్ ధన్ ఖాతాదారులు అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదని తెలిపారు.
దేశ ప్రజలందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ ఖాతాలను ప్రారంభించింది. ముఖ్యంగా పేద ప్రజలకు బ్యాంకు సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ ఖాతాలను ప్రవేశపెట్టారు. జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇది. జన్ ధన్ ఖాతాతో బీమా పథకం ప్రయోజనాలను పొందొచ్చు. అత్యవసర సమయాల్లో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. ఏ బ్యాంకులోనైనా ఈ ఖాతాను తెరవచ్చు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని కూడా ఈ ఖాతాద్వారా పొందొచ్చు. లక్షలాది మంది కలిగిన జన్ ధన్ అకౌంట్ ఖాతాదారులకు నిర్మళా సీతారామన్ తీపికబురును అందించారు. జన్‌ధన్‌తో పాటు బేసిక్ సేవింగ్స్ ఖాతాల్లో కనీస నగదు నిల్వ ఉంచాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
ఇతర ఖాతాదారులు, తమ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచని సందర్భాల్లోనే బ్యాంకులు జరిమానాలు విధిస్తున్నాయని తెలిపారు. గత అయిదేళ్లలో కనీస నిల్వ లేని కారణంగా ఖాతాదారుల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.8,500 కోట్లు వసూలు చేయడానికి సంబంధించి రాజ్యసభ ప్రశ్నా సమయంలో నిర్మలా సీతారామన్ ఈ సమాధానమిచ్చారు. జన్ ధన్ ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయకపోయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాంకు సేవలు పొందొచ్చు.